EntertainmentLatest News

నందమూరి ఫ్యామిలీపై తారకరత్న భార్య కామెంట్స్.. ఆరోజు తప్పకుండా వస్తుంది!


నటుడు నందమూరి తారకరత్న చిన్న వయసులోనే కన్నుమూసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆయన జ్ఞాపకాలతో బ్రతుకుతున్నారు తారకరత్న భార్య, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ అలేఖ్య రెడ్డి. వీరిది ప్రేమ వివాహం. 2012 లో పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. పదేళ్లు హ్యాపీగా సాగింది వీరి జీవితం. కానీ గతేడాది తారకరత్న హఠాన్మరణంతో అలేఖ్య జీవితంలో విషాదం నెలకొంది. అయినప్పటికీ తారకరత్న జ్ఞాపకాలతో జీవిస్తూ, ధైర్యంగా పిల్లలను చూసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా తారకరత్న కుటుంబం గురించి ఆమె చేసిన ఎమోషనల్ కామెంట్స్ హత్తుకునేలా ఉన్నాయి.

తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ చిట్ చాట్ నిర్వహించారు అలేఖ్య. ఈ సందర్భంగా ఆమెను ఓ నెటిజన్ “తారక్ అన్న వాళ్ళ పేరెంట్స్.. మిమ్మల్ని, మీ కిడ్స్ ని యాక్సెప్ట్ చేస్తారనే నమ్మకం ఉందా మీకు?” అని అడిగాడు. అలేఖ్య దానికి సమాధానంగా “ఆశతోనే ఇన్నేళ్లు ముందుకు సాగుతూ వచ్చాం. తారక్ గారు ఎప్పుడూ ఆశ, నమ్మకాన్ని వదిలిపెట్టలేదు.. నేను కూడా వదిలిపెట్టను. ఖచ్చితంగా ఏదో ఒక రోజు అది జరుగుతుంది. నాకు నమ్మకం ఉంది. పిల్లలకి ఓ ఫ్యామిలీ అంటూ ఉంటుంది.” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా తారకరత్న మాదిరిగానే అలేఖ్య కూడా తెలుగుదేశం పట్ల, నందమూరి కుటుంబం పట్ల ఎంతో అభిమానం చూపుతుంటారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించినప్పుడు తన సంతోషాన్ని పంచుకున్నారు. అలాగే తన చినమామయ్య నందమూరి బాలకృష్ణ తమ కుటుంబానికి అండగా ఉన్న విషయాన్ని, ఆయన పట్ల వారి కుటుంబానికి ఉన్న ప్రేమని కూడా పలు సందర్భాల్లో అలేఖ్య పంచుకున్నారు.



Source link

Related posts

Mokshagna new look goes viral పర్ఫెక్ట్ గా హీరో లుక్ లోకి నందమూరి మోక్షజ్ఞ

Oknews

వాళ్ళు విడిపోతే వీళ్ళేం చేస్తారు

Oknews

Prime Minister Narendra Modi paid special pooja to Goddess Ujjaini Mahankali in Secunderabad As part of Telangana two days visit

Oknews

Leave a Comment