మెగా ఫ్యామిలీలోకి చిన్న కోడలిగా, నాగబాబు కోడలిగా, వరుణ్ తేజ్ కి భార్యగా అడుగుపెట్టిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. పెళ్లి తర్వాత నటనకు ఫుల్ స్టాప్ పెట్టబోతోందా? నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతుందా? అసలు ఆమె వరుణ్ తేజ్ భార్యగా, మెగా కోడలిగా డీసెంట్ గా కాపురం చేసుకుంటుందా.. లేదంటే యాక్టింగ్ అంటూ సినిమాలు చేస్తుందా ఇలా ఎవరి అనుమానాలు వారికి ఉన్నాయి. అటు లావణ్య పెళ్ళికి ముందు నటించిన వెబ్ సీరీస్ విడుదలకు సిద్దమవగా,.,. ఆమె ఆ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది.
అయితే లావణ్య కెరీర్ పై ఎవరికి ఎన్ని అనుమానాలున్నా ఆమె మరదలు నిహారిక కొణిదెల అందరి అనుమానాలను నివృత్తి చేసింది. తాము ఇండస్ట్రీ రిలేటెడ్, తమ వృత్తే నటన, అలాంటిది తామెందుకు నటనకు ఫుల్ స్టాప్ పెడతాం, మా వదిన లావణ్య త్రిపాఠిని కూడా పెళ్లి తర్వాత నటనను ఆపేస్తున్నారా అని అడుగుతున్నారట, నేనూ మా వదిన లావణ్య ఎందుకు నటనకు దూరమవ్వాలి, అది ప్రొఫెషన్ అంటూ నిహారిక లావణ్య త్రిపాఠి ఇక మీదట కూడా నటిస్తుంది క్లారిటీ ఇచ్చింది.