EntertainmentLatest News

నమ్మినవాడు మోసం చేశాడు.. రూ.14 కోట్లు నష్టపోయిన హీరోయిన్‌!


మన సొసైటీలో మంచి వారు, చెడ్డవారు అనే రెండు రకాల మనుషులు ఉంటారు. వీరితోపాటు మోసగాళ్ళు అనే మూడో రకం వారు కూడా అప్పుడప్పుడు వార్తల్లోకి వస్తుంటారు. మోసం చేసేవాడి కంటే మోసపోయేవారే తెలివి తక్కువ వారు అంటారు. కొందరి విషయంలో అది నిజమే అనిపిస్తుంది. మోసపోవడానికి వారు, వీరు అనే తేడా ఏమీ లేదు. ఎంత తెలివిగల వారినైనా బురిడీ కొట్టించగల సమర్థులు ఉంటారు. అలాంటి ఓ ఘటన హీరోయిన్‌ రిమ్మీ సేన్‌ విషయంలో జరిగింది. బాలీవుడ్‌లో ధూమ్‌ సిరీస్‌తోపాటు కొన్ని భారీ చిత్రాల్లో నటించిన రిమ్మీ.. తెలుగులో నీతోడు కావాలి, అందరివాడు చిత్రాల్లో కనిపించింది. తన స్నేహితుడు రోనక్‌ వ్యాస్‌ వల్ల రూ.4 కోట్లకుపైగా నష్టపోయానని, ప్రస్తుతం న్యాయం కోసం పోరాటం చేస్తున్నానని సోషల్‌ మీడియా వేదికగా తెలియజేసింది. 

‘నాలుగేళ్ల క్రితం రోనక్‌ పరిచయమయ్యాడు. మేం మంచి స్నేహితులుగా చాలా కాలం కొనసాగాం. అయితే నన్ను డబ్బు విషయంలో మోసం చేశాడు. అతను మోసం చేసిన వారి లిస్ట్‌లో చాలా మంది ఉన్నారని తెలిసింది. మా కుటుంబంలో వ్యక్తిగా కలిసిపోయిన రోనక్‌ అధిక వడ్డీ ఇప్పిస్తానని మొదట నా దగ్గర రూ.20 లక్షలు తీసుకున్నాడు. వడ్డీ కూడా ఇచ్చేవాడు. అలా కొన్ని నెలలు గడిచిన తర్వాత ఎక్కువ డబ్బు ఇస్తే 15 శాతం వడ్డీ తీసుకొస్తానని చెప్పడంతో రూ.4.14 కోట్లు ఇచ్చాను. మొదటి నెల కొంత డబ్బు ఇచ్చాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్నకు కరోనా వచ్చిందని, డబ్బులు ఇవ్వలేనని చెప్పాడు. అది నిజమేననుకొని నమ్మాను. అలా నెలలు గడిచిపోతున్నా అతను మాత్రం డబ్బు ఇవ్వడం లేదు. నేను మోసపోయానని గ్రహించాను. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఇప్పుడా కేసు సీఐడీకి బదిలీ అయినట్టు చెప్పారు పోలీసులు. 

విచారణ వేగవంతంగా పూర్తి చేయాలని హైకోర్టులో పిటిషన్‌ వేశాను. రెండు రోజుల్లో రోనక్‌పై అరెస్ట్‌ వారెంట్‌ ఇష్యూ చేస్తారని తెలిసింది. ప్రస్తుతం వడ్డీతో సహా రూ.14 కోట్లు రావాల్సి ఉంది. మొదటే పోలీసుల ముందు అతను సరెండర్‌ అయినట్టయితే అసలు మాత్రం తీసుకొని వదిలేసేదాన్ని. ఇప్పుడు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి నేను ఈ విషయంలో ఎంత దూరమైనా వెళతాను, నాకు న్యాయం జరిగే వరకూ పోరాడతాను’ అంటూ ఎమోషనల్‌గా చెబుతోంది రిమ్మీసేన్‌. 

 



Source link

Related posts

KCR took charge as the leader of opposition in Telangana | MLA KCR Oath : ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం

Oknews

కాంగ్రెస్‌లోనే చనిపోతా.. కేకేపై కేసీఆర్ ఫైర్!

Oknews

YS Sharmila Son Raja Reddy Ties the knot with Priya Atluri at Jodhpur Palace

Oknews

Leave a Comment