2020 లో వచ్చిన పలాస లాంటి మెచ్యూర్డ్ సినిమా లో కొత్త వాడైనా సరే సెటిల్డ్ పెరఫార్మెన్స్ తో నటించి ప్రేక్షకులతో పాటు సినీ విమర్శకులని సైతం మెప్పించిన నటుడు రక్షిత్ అట్లూరి. ఆ సినిమాలోని శ్రీకాకుళం జానపదానికి చెందిన నీ పక్కన పడ్డాదిలే చూడవే పిల్ల నాది నక్కి లేసు గొలుసు అనే పాట తెలుగు రాష్ట్రాల్లో మారు మోగిపోతున్నంత కాలం రక్షిత్ తెలుగు ప్రజల మనసులో ఉంటాడు. ఇప్పుడు రక్షిత్ నుంచి తాజాగా నరకాసుర అనే మూవీ రాబోతుంది. తాజాగా ఆ మూవీ కి సంబంధించిన ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. ట్రైలర్ చూసిన ప్రేక్షకులందరు సూపర్ అని అంటున్నారు.
భగవంత నువ్వు నిర్మించుకున్న ప్రపంచం..ఈ ప్రపంచంలో నిన్నే నమ్ముకున్న నీ వాళ్ళు..ఇంతమంది ఉన్నా బయట ప్రపంచానికి నువ్వింకా అనాధవే అనే వాయిస్ ఓవర్ తో ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. హీరో రక్షిత్ తో పాటు హీరోయిన్ అపర్ణ జనార్దన్, నాజర్,చరణ్ రాజ్, శత్రు మరికొంత మంది నటులు ట్రైలర్ లో తమ పాత్ర లకి తగ్గట్టు ఆహార్యాన్ని ప్రదర్శించి ట్రైలర్ ఆసాంతం ఆకట్టుకున్నారు. అలాగే ట్రైలర్ లో చూస్తున్న దాన్ని బట్టి నరకాసుర మూవీ ఒక ఊరులో జరిగే కథగా అనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ లో శివుడ్ని చూపించిన విధానాన్ని బట్టి ఒక మనిషిలో దేవుడు, రాక్షసుడు ఇద్దరు ఉంటారని అలాగే పరిస్థితులని బట్టి మనిషి రాక్షసుడుగా మారతాడనే విధంగా ఆయా పాత్రల మధ్య కత్తులతో ఊచకోత కూడా జరిగింది. ఇలా ట్రైలర్ చివరివరకు కూడా ఉత్కంఠభరితంగా సాగి ప్రతి ఒక్కరిని ఆకట్టుకోవడమే కాకుండా నరకాసుర సినిమా చూడాలనే క్యూరియాసిటీ ని కూడా కలిగించింది.
రక్షిత్ లారీ డ్రైవర్ గా నటిస్తున్న నరకాసుర సినిమా కంప్లీట్ గా ఒక డిఫరెంట్ మూవీ అని అర్ధం అవుతుంది. నవంబర్ 3 న తెలుగు,తమిళ ,మలయాళం కన్నడ ,హిందీ భాషల్లో విడుదల కాబోతుంది. సుమోఖా క్రియేషన్స్ అండ్ ఐడిఎల్ ఫిలింమేకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా సెబాస్టియన్ దర్శక బాధ్యతలు చేపట్టారు.