Health Care

నల్లపిల్లి ఎదురు వచ్చినప్పుడు ఆగడం మంచిదేనా?


దిశ, ఫీచర్స్ : ఏదైనా శుభకార్యం చేసుకున్నప్పుడు లేదా ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్లినప్పుడు నల్లపిల్లి ఎదురైతే కాసేపు ఆగిపోతాము. ఇక మన పెద్దవారు పిల్లి ఎదురు వస్తే వెళ్లిన పనికాదు, మంచిదికాదని చెబుతుంటారు.

మరి ఇది నిజమేనా..? దీని వెనుక ఏమైనా సైంటిఫిక్ రీజన్ ఉందా అని చాలా మంది ఆలోచిస్తారు. అయితే దీనికి గల కారణాన్ని ఒకొక్కరూ ఒక్కో విధంగా తెలియజేస్తున్నారు.పిల్లులను ఇతర పెద్ద జంతువులు లేదా, మనుషులు వెంబడిస్తుంటాయి. దీంతో అవి త్వర త్వరగా వెళ్లిపోతుంటాయి. అందు వలన పిల్లి ఎదురు వచ్చినప్పుడు కాసేపు ఆగితే, అది దాని ప్రదేశానికి వెళ్తుందంట. అలాగే గతంలో ఎడ్లబండ్లపై వెళ్తుంటే ఆవులు చలించేవంట, తద్వారా డ్రైవర్ కొద్దిసేపు ఆగి బండిని నడిపేవాడంట, అపపటి నుంచి పిల్లి ఎదురు వస్తే అశుభం అని ఆగడం ఆచారంగా మారింది. మరికొంత మంది, పిల్లిని రాహువుగా పరిగణిస్తారు. పిల్లి ఎదురు వస్తే రాహువు ప్రభావం ఉండబోతుంది. దీంతో ఏదో అశుభం జరుగుతుందని భావించి తాము వెళ్లే పనులను వాయిదా వేసుకుంటారంట.ఇలా పిల్లి ఎదురు రావడంపై అనేక కారణాలు ఉన్నాయి. ఇక దీన్ని కొందరు నమ్మితే, మరికొందరు విస్మరిస్తారు. 



Source link

Related posts

బయటకు వెళ్లేముందు షూ వేసుకుంటున్నారా?.. ఒక్క క్షణం ఆగి ఈ పని చేయండి.. లేకుంటే!

Oknews

వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలా.. ఈ ఐదు డ్రింక్స్ తాగాల్సిందే!

Oknews

Viral : ప్రపంచమంతా 2024లో ఉంటే.. అక్కడి ప్రజలు మాత్రం 2016లోనే!

Oknews

Leave a Comment