EntertainmentLatest News

నవీన్ చంద్ర కోసం రంగంలోకి దిగిన కాజల్ అగర్వాల్!


నవీన్ చంద్ర(Naveen Chandra) లీడ్ రోల్ లో నటిస్తున్న ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ‘ఇన్స్ పెక్టర్ రిషి'(Inspector Rishi). సునైన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారర్ క్రైమ్ కథతో ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు డైరెక్టర్ నందిని జె.ఎస్. మేక్ బిలీవ్ ప్రొడక్షన్స్ పై సుఖ్ దేవ్ లాహిరి నిర్మించారు. అమెజాన్ తమిళ్ ఒరిజినల్ గా “ఇన్స్ పెక్టర్ రిషి” ఈ నెల 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు రాబోతోంది. కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), నవీన్ చంద్ర “సత్యాభామ” అనే సినిమాలో పెయిర్ గా నటిస్తున్నారు. ఈ సినిమా సెట్ లో “ఇన్‌స్పెక్టర్ రిషి”  వెబ్ సిరీస్ ట్రైలర్ ను చూసి ఇంప్రెస్ అయిన కాజల్ అగర్వాల్.. ట్రైలర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉందన్న కాజల్.. నవీన్ చంద్రతో పాటు వెబ్ సిరీస్ టీమ్ కు బెస్ట్ విషెస్ అందించారు. 

తీన్ కాడు అనే ప్రాంతంలోని అడవిలో వరుస హత్యలు జరుగుతుంటాయి. జంతువుల కళేబరాలకు పట్టినట్లే మనుషుల శవాలకు పురుగుల గూడు అల్లుకుని ఉంటుంది. అడవిలో తిరిగే రాట్చి అనే దెయ్యమే ఈ హత్యలు చేస్తోందని ఊరి జనం చెబుతుంటారు. కేసు ఇన్వెస్టిగేషన్ సీబీ సీఐడీకి చేరుతుంది. ఈ హత్యలకు కారణాలు తెలుసుకునేందుకు ఆ ఊరికి వస్తాడు కొత్త ఇన్‌స్పెక్టర్ రిషి. ఊరి జనం మాటలు నమ్మని రిషి సైంటిఫిక్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో రిషి అతని పోలీస్ టీమ్ షాక్ అయ్యే విషయాలు తెలుస్తుంటాయి. తీన్ కాడు ప్రాంత వరుస హత్యలకు  దెయ్యమే కారణమైతే అందుకు పరిష్కారాన్ని ఇన్‌స్పెక్టర్ రిషి ఎలా కనుక్కున్నాడు అనే అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.

 



Source link

Related posts

కాలికి 12 కుట్లు.. రెండురోజుల్లోనే.. రవితేజ

Oknews

మరో జన్మ ఉంటే నీ కలలన్నీ నిజం కావాలి..

Oknews

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత చేస్తున్న సినిమాలో నాని హీరో!

Oknews

Leave a Comment