Health Care

నాకు ఫుడ్ బిల్ పంపకండి.. జొమాటోకి వింత రిక్వెస్ట్ చేసిన కస్టమర్..


దిశ, ఫీచర్స్ : కాలంతో పాటు మనుషులు కూడా చాలా మారిపోతున్నారు. ఇంతకుముందు వ్యక్తులు ఏదైనా వస్తువులు కొనడానికి మార్కెట్‌కి వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్ ద్వారా వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. అలాగే ఏదైనా ఫుడ్ తినాలనిపిస్తే చాలు వెంటనే స్విగ్గీ, జమాటోలో ఆర్డర్ పెడుతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడు ఆకలి అనిపిస్తే అప్పుడు నచ్చిన ఫుడ్ ని ఆర్డర్ పెట్టుకుంటున్నారు. కస్టమర్లను సాటిస్ఫై చేసేందుకు డెలివరీ బాయ్స్ కూడా కొన్ని నిమిషాల్లోనే ఫుడ్ ని డెలివరీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓ వ్యక్తి చేసిన ఫుడ్ ఆర్డర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ ఆర్డర్ లో ఏముంది అనుకుంటున్నారా.. మరి అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక వ్యక్తి తన కోసం Zomato నుండి ఆహారాన్ని ఆర్డర్ చేశారు. ఆర్డర్ పెడుతూ కంపెనీకి ఓ వింత రిక్వెస్ట్ ని కూడా చేశాడు. ఆ రిక్వెస్ట్ ని చూసిన వారికి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అవ్వక తప్పదు. సాధారణంగా ప్రజలు ఏదైనా కొనుగోలు చేసినప్పుడు కచ్చితంగా బిల్లు తీసుకుంటారు. కానీ ఈ వ్యక్తి తను ఆర్డర్ చేసిన ఫుడ్ తో పాటు బిల్లును పంపవద్దని Zomatoని అభ్యర్థించారు. అంతే కాదు ఫుడ్ ప్యాకెట్ పై కానీ, మరెక్కడైనా ఆహారంలో చికెన్ ఉందని రాసి ఉండరాదని కంపెనీకి మరో అభ్యర్థన చేసాడు. తన ఇంట్లో నాన్ వెజ్ ఫుడ్ కు అనుమతి లేదంటూ ఈ వింత రిక్వెస్ట్ పెట్టాడు. అలాగే ఫుడ్ ని ఎంజాయ్ చేస్తే తినేందుకు Zomato నుండి పాత్రను కూడా అడిగాడు.

ఆ రిక్వెస్ట్ లను చూసిన రెస్టారెంట్ యజమాని దానికి విరుద్ధంగా చేశారు. రెస్టారెంట్ యాజమాన్యం అతనికి ఆహార బిల్లును పంపడమే కాకుండా, ఆ బిల్లుపై అతను ఏమి చెప్పాడో కూడా రాశారు. ఈ ఫన్నీ పోస్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో @Sahilarioussss అనే ఐడితో షేర్ చేశారు.





Source link

Related posts

Types Of Salt: ఉప్పులో ఐదు రకాలు.. ఆరోగ్యంపై ఏది ఎలా ప్రభావం చూపుతుందంటే..!

Oknews

ఉమెన్స్ డే స్పెషల్‌గా గిఫ్టింగ్ స్టోర్ ప్రారంభం.. భారీ ఆఫర్లు ప్రకటించిన అమెజాన్

Oknews

చంద్రుడిపై భారీ అగాధాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏలియన్స్ ఉన్నారా?

Oknews

Leave a Comment