అక్కినేని నాగ చైతన్య (naga chaitanya) కి 2022 సంక్రాంతికి వచ్చిన బంగార్రాజు తర్వాత సరైన హిట్ లేదు. కొన్ని రోజుల క్రితం వచ్చిన దూత హిట్ అయినా కూడా అది ఓటిటి ఖాతాలోకి వెళ్ళింది. సరైన హిట్ పడాలే గాని తెలుగు చిత్ర సీమలో తనదైన ముద్ర ని చై చాలా బలంగా చాటగలడు. ఏ మాయ చేసావే, తడాకా, ప్రేమమ్, 100 % లవ్, మజిలీ, మనం,వెంకిమామ లాంటి చిత్రాలే అందుకు ఉదాహరణ.కొన్ని సినిమాలు ప్లాప్ అయినా కూడా చై నటనకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తాత ఏఎన్ఆర్, తండ్రి నాగార్జున లాగా అన్ని క్యారెక్టర్స్ చెయ్యగల సమర్థుడు. లేటెస్టుగా తండేల్(thadel) తో ముస్తాబవుతున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్ట్ న్యూస్ ఒకటి వైరల్ గా మారింది.
నాగ చైతన్య తండేల్ కోసం సుప్రీం సుందర్ (Supreme Sundar) రంగంలోకి దిగబోతున్నాడు.ఈయన ఇండియన్ సినీ పరిశ్రమలోనే ఫేమస్ ఫైట్ మాస్టర్. మలయాళంలో సంచలన విజయం సాధించిన అయ్యప్పన్ కోషియం కి ఫైట్ మాస్టర్ గా చేసి మంచి గుర్తింపు ని పొందాడు. లేటెస్ట్ గా యానిమల్ ఫైట్స్ ని డిఫరెంట్ గా కంపోజ్ చేసి పెద్ద సంచలనమే సృష్టించాడు. ఆ మూవీ విజయంలో ఫైట్స్ కూడా కీలకమయ్యాయి. ఇప్పుడు తండేల్ లోని ఒక భారీ యాక్షన్ సీన్ కోసం మేకర్స్ సుందరం మాస్టర్ ని తీసుకొచ్చారు. ఆల్రెడీ షూట్ కూడా చేసారు. ఒక రేంజ్ లో ఆ సీక్వెన్స్ వచ్చాయని అంటున్నారు.రేపు థియేటర్స్ లో గూస్ బంప్స్ రావడం గ్యారంటీ అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తుండటంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు
తండేల్ ని అల్లు అరవింద్ సమర్పణలో గీత ఆర్ట్స్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. నాగ చైతన్య కెరీర్లోనే అత్యధిక బడ్జట్ తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ రికార్డులు సృష్టిస్తుంది. తండేల్ నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగానే తెరకెక్కుతుంది. తండేల్ అనే వ్యక్తి సముద్రంలో వేటకి వెళ్లి పాకిస్థాన్ చేతికి చిక్కుతాడు. ఈ నేపథ్యంలో ఏం జరిగిందనేదే కథ. ఇక హీరోయిన్ గా సాయి పల్లవి చేస్తుండటంతో అందరిలోను మూవీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఆల్రెడీ సాయి పల్లవిని ఉద్దేశించి చిట్టి తల్లి నేను వచ్చేస్తున్నా కదే ఓ పాళి నవ్వవే అని చై చెప్పే డైలాగే రికార్డు స్థాయిలో రీల్స్ ని సంపాదిస్తుంది. కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ కొట్టిన చందు మొండేటి తండేల్ కి దర్శకుడు.