Entertainment

నాగ చైతన్య విషయంపై సమంత లేటెస్ట్ కామెంట్స్ వైరల్ 


2017 లో సమంత, నాగ చైతన్యల పెళ్లి జరిగింది. 2021 లో  విడాకులు తీసుకున్నారు. ఇది అందరకి తెలిసిన విషయమే.పైగా పెళ్లి డేట్, విడాకులు డేట్ చెప్పమన్నా కూడా  చెప్పేవాళ్ళు బోలెడుమంది. ఎందుకంటే వాళ్ళిద్దరికీ తెలుగునాట లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఇక విడాకులు తీసుకున్న తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళు బతుకుతూ  కెరీర్ లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సొస్తుందంటే  సోషల్ మీడియా వేదికగా సమంత ఇచ్చిన రిప్లై ఒకటి  వైరల్ గా మారింది. 

సమంత  రీసెంట్ గా ఆమె ఒక పాడ్ క్యాస్ట్ వీడియో చేసింది. అందుకు సంబంధించి  సోషల్ మీడియాలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ప్రశ్న ఆమెకి ఎదురయ్యింది. అమాయడైన నీ భర్త చైతన్యను ఎందుకు వదిలేసావని ఒక నెటిజన్ అడిగాడు. అందుకు సమంత చెప్పిన సమాధానం విని అందరు ఆశ్చర్యపోతున్నారు. సారీ ఇలాంటి ఆచరణలు మీకు ఏ విధమైన సహాయం చేయలేవు. మీకు అంతా మంచి జరగాలి. అలాగే  బలంగా కూడా మారాలని కోరుకుంటున్నాను మీ జీవితం గురించి  మీరే ఆలోచించుకోవాలి. ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువగా ఆలోచించేంత తక్కువ మనసుతో ఉండకూడదు అని కూడా చెప్పింది.

వాస్తవానికి సమంత ఎప్పుడు కూడా ఇంత కూల్ గా రిప్లై ఇవ్వదు. చై తో విడాకులు తీసుకున్న దగ్గరనుంచి తనపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. వాటన్నిటికీ  గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. కానీ ఇప్పుడు కూల్ గా సమాధానం ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఇక సామ్, చై లు ఎందుకు విడాకులు తీసుకున్నారనే విషయంలో అసలు నిజం ఎవరకి తెలియదు. వాళ్లిదరు కూడా  కారణాన్ని చెప్పలేదు. అందరు రకరకాలుగా ఉహించుకుంటూనే వస్తున్నారు. చై ప్రస్తుతం తండేల్ అనే మూవీ చేస్తున్నాడు. సమంత సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో చేస్తుంది.

 



Source link

Related posts

దేవర నయా అప్ డేట్.. నేను రెడీ మీరు రెడీ నా

Oknews

పరువు వెబ్ సిరీస్ రివ్యూ

Oknews

టాలీవుడ్ లో విషాదం.. నేషనల్ అవార్డు విన్నర్ కన్నుమూత!

Oknews

Leave a Comment