EntertainmentLatest News

నాని దర్శకుడి పవర్ ఫుల్ మూవీ.. హీరో ఎవరో తెలుసా?


‘బాహుబలి’, ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ సినిమాలతో ప్రేక్షకులకి చేరువైన రాకేష్ వర్రే ఎప్పుడూ ప్రయోగాత్మక పాత్రలనే ఎంచుకుంటున్నాడు. కొద్దిరోజుల క్రితం ‘ఉయ్యాలా జంపాలా’, ‘మజ్ను’ చిత్రాల ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో ఓ కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ‘జితేందర్ రెడ్డి’ అనే పేరుతో హీరో ఎవరో తెలియకుండా  పోస్టర్లు  రిలీజ్ చేశారు. పోస్టర్లు చూడడానికి చాలా పవర్ఫుల్ గా ఉన్నప్పటికి అందులో ఉన్న కథానాయకుడు ఎవరు?, అసలు టైటిల్ లో ఉన్న ఈ జితేందర్ రెడ్డి ఎవరు? అని చర్చనీయాంశం అయ్యింది. ఒక వ్యక్తి కొంత మంది జనాల ముందు కూర్చుని చిన్న పాప మీద చెయ్యి వేసి నాయకుడు శైలిలో కనిపిస్తాడు. కాని ఆ పోస్టర్ లో కూడా హీరో ఎవరు అనేది అర్థంకాలేదు. ఆ పోస్టర్ తో అసలు ఆ పాత్ర చెయ్యబోతున్న హీరో ఎవరు?, ఎందుకు అతన్ని దాచారు అని రకరకాల కథనాలు వినిపించాయి. ఇప్పుడు ఆ సస్పెన్స్ ని రివీల్ చేస్తూ ఇంకో పోస్టర్ ని విడుదల చేశారు. 

జితేందర్ రెడ్డి పాత్రలో రాకేష్ వర్రే గన్ పట్టుకుని ఎంతో డైనమిక్ గా నడుచుకుంటూ వస్తున్న పోస్టర్లను తాజాగా విడుదల చేశారు. పోస్టర్స్ లో రాకేష్ చూడడానికి ఒక యంగ్ పోలీస్ లాగా ఉన్నాడు. కాకపోతే ముందు రిలీజ్ చేసిన పోస్టర్స్ లో  లీడర్ లుక్స్ ఉన్నాయి.  మరో ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే ఈ జితేందర్ రెడ్డి క్యారెక్టర్ కి సరైన నటుడు కోసం దర్శకుడు విరించి వర్మ దాదాపు 6 నెలల పాటు అనేక మందిని రిజెక్ట్ చేసి చివరికి రాకేష్ వర్రే మాత్రమే ఈ పాత్రకి సరిపోతారని నమ్మి తీసుకున్నారట. మరి రాకేష్ ఆ నమ్మకాన్ని ఎంతవరకు నిలబెట్టుకున్నాడో త్వరలోనే తెలియనుంది.



Source link

Related posts

Game Changer October 10 though..! గేమ్ చేంజర్ అక్టోబర్ 10 అయితే..!

Oknews

బాలీవుడ్‌ సినిమాటోగ్రాఫర్‌ను పెళ్లాడిన టాలీవుడ్‌ హీరోయిన్‌!

Oknews

‘అబ్రహం ఓజ్లర్’మూవీ రివ్యూ

Oknews

Leave a Comment