నాని- శ్రీకాంత్ ఓదెల- సుధాకర్ చెరుకూరి సినిమా సెట్ మీదకు వెళ్లాలి. కాస్త టైమ్ వుంది. ఈ సినిమాలొ జాన్వి కపూర్ ను హీరోయిన్ గా తీసుకోవడానికి డిస్కషన్లు జరుగుతున్నాయని గ్రేట్ ఆంధ్ర వెల్లడించిన సంగతి తెలిసిందే.
సినిమాకు డిజిటల్ రైట్స్, హీరో రైట్స్ రూపంలో మంచి ఆదాయం రావాలి అంటే మంచి బాలీవుడ్ హీరోయిన్ వుండాలి. ఇప్పటికే మృణాళ్ తో నాని ఓ సినిమా చేసారు. అందువల్ల ఇంక వేరే ఆప్షన్లు చూడాల్సి వచ్చింది.
ఇక్కడే జాన్వి కన్నా ముందుగా రష్మిక పేరు డిస్కషన్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. డిజిటల్ రైట్స్, హిందీ రైట్స్ జనాల నుంచి కూడా రష్మిక పేరే సజెషన్ కు వచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఇక్కడ కొన్ని కారణాల వల్ల రష్మిక పేరు ను పక్కన పెట్టాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఈ కథలో హీరో హీరోయిన్ల మధ్య కొన్ని ఇంటిమసీ సీన్లు వున్నాయని తెలుస్తోంది. రష్మిక ఆ సీన్లు చేయను అని ఏమీ అనరు. కానీ ఇక్కడ వేరే తరహా ఆలోచనను హీరో నాని చేసినట్లు తెలుస్తోంది.
రష్మిక తెలుగులో బాగా పరిచయం. పైగా ఓ హీరోతొ మంచి స్నేహం వుంది. ఇప్పుడు ఇలాంటి సీన్లతో ఆమెతో నటిస్తే, ఫ్యాన్స్ మనోభావాలు అవీ ఎలా వుంటాయో తెలియదు. అందుకే రష్మిక పేరు ను పక్కన పెట్టారు. జాన్వీ పేరును ముందుకు తెచ్చారు. అయితే జాన్వీ ఇంకా ఊ అని ఫైనల్ గా అనలేదు. వన్స్ ఓకె అనగానే అనౌన్స్ చేస్తారు.
The post నాని-రష్మిక్.. ఎందుకు మిస్ అయింది? appeared first on Great Andhra.