Uncategorized

నారా లోకేశ్ కు ఏపీ సీఐడీ నోటీసులు, అక్టోబర్ 4న విచారణ-amaravati inner ring road case ap cid 41a notices to nara lokesh investigation october 4th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


లోకేశ్ పాత్ర కీలకం

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వ్యవహారంలో లోకేశ్‌ పాత్రకు సంబంధించి కీలకమైన 129 ఆధారాలను ఏపీ సీఐడీ సిట్‌ బృందం గుర్తించింది. సిట్‌ సేకరించిన ఆధారాల్లో.. సీఆర్‌డీఏ, మున్సిపల్, రెవెన్యూ శాఖలకు చెందిన కీలక పత్రాలు, ఈ మెయిల్‌ సందేశాలు, మ్యాపులు, టీడీపీ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు, ప్రైవేట్ ఏజెన్సీల ప్రతినిధుల వాంగ్మూలాలు ఉన్నాయి. కొందరు కీలక అధికారులు సంబంధిత నోట్‌ ఫైళ్లలో తాము లిఖితపూర్వకంగా తెలిపిన అభ్యంతరాలను బేఖాతరు చేసి మరీ ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్‌మెంట్‌ను ఖరారు చేశారని పేర్కొన్నారు. మరోవైపు ఐఆర్‌ఆర్‌ ఎలైన్‌మెంట్‌లో కీలక పాత్ర పోషించిన ప్రైవేటు ఏజెన్సీలు కూడా నాయకుల ప్రమేయాన్ని నిర్ధారించాయి. నిబంధనలకు విరద్ధంగానే ఐఆర్‌ఆర్‌ ఎలైన్‌మెంట్‌ను నిర్ధారించారని సిట్‌ అధికారులకు ఈ-మెయిల్స్‌ పంపాయి. ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ కోసం నిర్వహించిన సర్వే నివేదికను కూడా సిట్‌ అధికారులు జప్తు చేశారు. వీటన్నింటిలో లోకేశ్‌ కీలక పాత్ర పోషించారని సీఐడీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు లోకేశ్ సీఐడీ నోటీసులు ఇచ్చింది. అక్టోబర్ 4న సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలని సూచించారు.



Source link

Related posts

Chandrababu PS : చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్‌ సస్పెండ్‌ – ఏపీ సర్కార్ ఉత్తర్వులు

Oknews

ప్రకాశం జిల్లాలో దారుణం, పెళ్లి చేయడంలేదని తండ్రిని హత్య చేసిన కొడుకు-prakasam district crime son murdered father not bring marriage proposal ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు, పోసానిపై కేసు నమోదు!-rajahmundry police filed case on ysrcp leader posani krishna murali objectionable comments on pawan kalyan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment