ఈమధ్యకాలంలో సెలబ్రిటీల పెళ్ళిళ్ళు, విడాకులు… వంటి వార్తలు వైరల్ కావడం, తర్వాత అందులో నిజం లేదని సదరు సెలబ్రిటీలు ఖండిరచడం చాలా రొటీన్‌గా మారిపోయింది. అలాంటిదే మరో న్యూస్ వైరల్ అవుతోంది. టీవీల్లోనూ, సినిమాల్లోనూ బిజీగా ఉంటూ, సోషల్ మీడియాలో అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది. బిగ్‌బాస్‌లో కూడా పార్టిసిపేట్ చేసిన హరితేజ దాని తర్వాత మరింత క్రేజ్ తెచ్చుకుంది. క్రమం తప్పకుండా సోషల్ మీడియాలో కనిపించే హరితేజ కొన్నిరోజులుగా అడ్రస్ లేదట. దీంతో అభిమానులు, నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అందులో ప్రధానంగా హరితేజ భర్తతో విడాకులు తీసుకుందా? ఒకవేళ తీసుకుంటే… ఎందుకు, ఏమిటి, ఎలా.. అంటూ చర్చించుకుం టున్నారు.
ప్రస్తుతం హరితేజ ఆస్ట్రేలియాలో సింగిల్‌గానే వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలో విడాకుల ప్రస్తావన రావడానికి ఇది కూడా ఒక కారణం అంటున్నారు. ఈమధ్య అభిమానులతో చిట్ చాట్ సెషన్ చేసింది. వారిలో ఒకరు.. మీరు భర్త దీపక్‌తో విడాకులు తీసుకున్నారా? అని ప్రశ్నించాడు. దీనికి హరితేజ ‘నాలుగు రోజులు నెట్టింట యాక్టివ్‌గా లేకపోతే మనిషిని కూడా చంపేసేలా ఉన్నారే’ అంటూ తన భర్తతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. తన విడాకుల కామెంట్లకు ఫుల్ స్టాప్ పెట్టింది. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హరితేజ విడాకుల వార్తలో ఎంతమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చింది.