మెగాపవర్ స్టార్ అలియాస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (ram charan)ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు. నా కూతురికి తినిపించే విషయంలో నన్ను ఎవరు బీట్ చెయ్యలేరు. ఆ విషయంలో నాకు కొంచం సూపర్ పవర్ ఉందని చెప్తున్నాడు. అసలు విషయం ఏంటో చూద్దాం.
అందరి తండ్రుల లాగానే చరణ్ కూడా ఫాథర్స్ డే ని చాలా ఘనంగా జరుపుకున్నాడు. ఈ సందర్భంగా తన సంతోషాన్ని, ఆనందాన్ని జాతీయ మీడియాతో పంచుకున్నాడు. నా కూతురు క్లీంకార (klin kaara)వచ్చిన మొదటి ఆరు నెలల్లో ఒక కొత్త మెంబర్ ఇంట్లోకి వచ్చినట్టుగా అనిపించింది.ఆ తర్వాత ఉపాసన, క్లీంకార అనుబంధాన్ని చూసి ఆశ్చర్యపోయాను. క్లీంకారని చూస్తే చాలు ఏదో తెలియని ఆనందం వస్తుంది. నేను ఇంట్లో ఉంటే రోజుకు కనీసం రెండుసార్లు తినిపిస్తాను. తనకి అలా తినిపించడమంటే ఎంతో ఇష్టం. అలా తినిపించే విషయంలో మాత్రం నన్ను ఎవ్వరూ బీట్ చేయలేరు. ఎందుకంటే నేను తినిపిస్తుంటే గిన్నె మొత్తం ఖాళీ చేస్తుంది. ఈ విషయంలో నాకు కొంత సూపర్ పవర్ ఉందని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో చరణ్ చెప్పిన మాటలు పలువుర్ని ఆకర్షిస్తున్నాయి. ఫ్యాన్స్ అయితే క్లీంకార కంప్లీట్ డాడీ ప్రిన్సెస్ అంటు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అదే విధంగా చరణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసాడు. క్లీంకార ఇప్పుడు అందర్నీ గుర్తు పడుతుంది. నెను ఇంట్లో లేనప్పుడు నన్ను మిస్ అవుతున్నాననే భావాన్ని వ్యక్తం చేస్తుంది.నాకు కూడా తనని మిస్ అవుతున్నానే బాధ ఉంటుంది. అందుకే ఎక్కువగా బయటకు వెళ్లాలని అనిపించడం లేదు. పదిహేను సంవత్సరాలుగా కష్టపడుతూనే వస్తున్నాను. ఇప్పుడు మాత్రం సాయంత్రం ఆరు గంటలకే ఇంటికి తిరిగి వచ్చేయాలని ఉందని చెప్పాడు. ఉపాసన(upasana)కూడా ఒక అద్భుతమైన పేరెంట్ అని చెప్పుకొచ్చాడు. చరణ్ ప్రెజంట్ గేమ్ చేంజర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దసరా కానుకగా అక్టోబర్ నెలలో విడుదల చెయ్యాలనే పట్టుదలతో ఉన్నాడు.