సిల్వర్ స్క్రీన్ కి ఒక ఊపుని తెచ్చే నటుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr) కూడా ఒకడు. నూనూగు మీసాల వయసు నుంచే ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులని సృష్టిస్తు అగ్ర హీరో అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాడు. 2022 లో వచ్చిన ఆర్ఆర్ఆర్ తర్వాత మళ్ళీ ఇప్పటికి వరకు కనిపించలేదు. దీంతో అభిమానులు ఎన్టీఆర్ కొత్త మూవీ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. వాళ్ళ ఆశలని పరిగణలోకి తీసుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు శరవేగంగా తన సినిమాలని పూర్తి చేసే పనిలో ఉన్నాడు.
ఎన్టీఆర్ అప్ కమింగ్ ప్రాజక్టులు రెండు. ఒకటి దేవర(devara)కాగా ఇంకొకటి వార్ 2. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్(hrithik roshan)తో కలిసి వార్ 2 (war 2)లో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఇప్పుడు ఈ మూవీని త్వరగా కంప్లీట్ చేసే పనిలో ఎన్టీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది.ఈ మేరకు అగస్ట్ నుంచి వరుసగా వార్ కి డేట్స్ కేటాయించాడనే వార్తలు వస్తున్నాయి. ఆ విధంగా నవంబర్ లోపు తన పార్ట్ ని పూర్తి చెయ్యాలని నిర్ణయించుకున్నటుగా తెలుస్తుంది. ఈ షెడ్యూల్ లో కథకి కీలకమైన ఇంటర్వెల్ పార్ట్ షూట్ చెయ్యబోతున్నారని కూడా అంటున్నారు. ఈ సీక్వెన్స్ లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ తో పాటు ఇతర భారీ తారాగణం మొత్తం పాల్గొనబోతుందని టాక్.
ఇప్పడు ఈ విషయంతో ఎన్టీఆర్ తన అభిమానులకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో అర్ధం అవుతుంది.ఎందుకంటే ఒక పక్కన దేవర తో బిజీగా ఉన్నాడు.సెప్టెంబర్ 27 కి ముహూర్తం దగ్గర పడుతుండంతో దేవర కి వీలైనంత త్వరగా గుమ్మడి కాయ కొట్టే పనిలో ఉన్నాడు. ఇలా రెండు సినిమాల షూటింగ్స్ లో ఒకేసారి పాల్గొంటుంది తన అభిమానులని రంజింపచేయడానికే. దేవర కి కొరటాల శివ(koratala shiva)దర్శకుడు గా వార్ 2 కి అయాన్ ముఖర్జీ(Ayan Mukerji)