EntertainmentLatest News

నా కల నిజమైన వేళ…దేవిశ్రీ స్టూడియోస్ లో ఇసైజ్ఞాని ఇళయరాజా!



దేవిశ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన మ్యూజిక్ ఎప్పుడు యూనిక్ గా ఉంటుంది. సంగీతం అందించడమే కాదు పాడడం కూడా చేస్తారు. రీసెంట్ గా పుష్ప సినిమాకు ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడిగా  నేష‌న‌ల్ అవార్డు అందుకున్నాడు. అలాంటి దేవి శ్రీప్రసాద్ ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో కొన్ని పిక్స్ ని పోస్ట్ చేసాడు.  ‘చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు , సంగీతం అంటే తెలీనప్పుడు, ఈ మాస్ట్రో ఇసైజ్ఞాని ఇళయరాజా సార్ సంగీతం నా మీద అద్భుత మంత్రంలా పని చేసింది..ఆయన సంగీతాన్ని వింటూనే పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యేవాడిని. ఆయన సంగీతంతో నాకు విడదీయరాని బంధం ఉంది. అదే నన్ను మ్యూజిక్ డైరెక్టర్ ని అయ్యేలా చేసింది. నేను మ్యూజిక్ కంపోజర్‌గా మారాకా నేనొక  స్టూడియోని సెట్ చేసుకున్నాక అందులో ఇళయరాజా సార్ పెద్ద ఫోటోని కూడా ఏర్పాటు చేసుకున్నా. కానీ ఎప్పుడైనా ఒక్కసారి ఇళయరాజా సర్ నా స్టూడియోకి వస్తే బాగుండు అని కలలు కన్నాను. ఎట్టకేలకు నా కల నిజమయ్యింది.

అది కూడా నా గురువు మాండోలిన్ శ్రీనివాస్ అన్న పుట్టినరోజు నాడే కావడం గొప్ప సందర్భం. మాండలిన్ శ్రీనివాస్ అన్నా.. ఇంతకంటే నిన్నేం అడగాలి.. నా సంగీత దేవుడు ఇసైజ్ఞాని ఇళయరాజా సర్ నా స్టూడియోకి వచ్చి నన్ను, నా టీమ్ ని ఆశీర్వదించారు. ” అంటూ దేవిశ్రీ ప్రసాద్ ఒక నోట్ ని పోస్ట్ చేసాడు. ఇక ఈ పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.  ఈ పిక్స్ చూసిన ప్రభుదేవా డీఎస్పి సర్ చాలా ట్రిమ్ ఐనట్టున్నారు. డీఎస్పి సార్ కల నిజమైంది. మీరూ ఎవరినీ చూసి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యారో ఆ మహానుభావుడే మీ స్టూడియోకి వచ్చి మీరు పెట్టుకున్న ఆయన  ఫోటో చూసి మీ పియోనో ప్లే చేసారు. ఇంతకన్నా ఆశీర్వాదం, జీవిత సాఫల్యం వుండదేమో దేవి సార్. 1000 ఆస్కార్ అవార్డులు రావడం లాంటిది. ఈ క్షణానికి అభినందనలు. లవ్ యు దేవి సర్” అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 



Source link

Related posts

సుహాస్ కి షేక్ హ్యాండా.. హ్యాండా..సంచలనం రేపుతున్న స్టార్ హీరోయిన్

Oknews

Mammootty : టర్బోగా మమ్ముట్టి మరో కొత్త అవతారం!

Oknews

‘మతిమారన్’ మూవీ రివ్యూ

Oknews

Leave a Comment