Entertainment

నా గురించి ఆలోచించకపోవడం మీ హక్కు.. సినిమాలు మానేశా  


 

నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమైన ముంబై భామ అయేషా టకియా..తెలుగులో ఆ ఒక్క సినిమా చేసినా కూడా బాలీవుడ్ లో మాత్రం 20  సినిమాల దాకా చేసింది. ఇటీవల సోషల్ మీడియాలో తన  మీద ట్రోల్ల్స్ వస్తున్నాయి. ఇక అలాంటి వాళ్ళు తన జోలికి రాకుండా మైండ్ బ్లోయింగ్ ఆన్సర్స్ ఇచ్చి టాక్ అఫ్ ది డే గా నిలిచింది. 

ఆయేషా  రీసెంట్ గా  తన కుటుంబ సభ్యుల తో కలిసి గోవా వెళ్ళడానికి ముంబై  ఎయిర్ పోర్ట్ కి వెళ్ళింది. ఆ టైం లో కొంత మంది ఫొటోలకి ఫోజులు ఇవ్వమని అడిగితే ఇచ్చింది. ఆ తర్వాత ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి  ఇప్పుడు ఆ పిక్స్ ని చూస్తున్న వాళ్ళు ఆమె  లుక్ మీద  ట్రోల్ల్స్ వేస్తున్నారు.దీంతో  రంగంలోకి దిగిన అయేషా  దేశంలో నా లుక్ గురించి చర్చించుకోవడం తప్ప ఇంక వేరే పని ఏది లేదనుకుంటా  అయినా  నా లుక్స్ ఎలా ఉండాలో నాకు  తెలుసు అంటు  ఘాటుగానే సమాధానం ఇచ్చింది. 

నా లుక్ తో నేను సినిమాల్లో ఎలా రానిస్తానని  అనవసరంగా నా గురించి ఆలోచిస్తు ఎవరు బాధ పడకండి. నేను సినిమాలు మానేసి చాలా కాలం అయ్యింది. పైగా  ఇక నటించను కూడా.  ఇప్పుడు నా జీవితం చాలా హ్యాపీగా సాగిపోతుందని చెప్పుకొచ్చింది. అలాగే నా గురించి  ఆలోచించకుండా ఉండే హక్కు మీకు ఉందనే  గమ్మతయ్యిన మాటని  కూడా చెప్పింది. ఇప్పుడు అయేషా  ట్రోలర్స్ కి  ఇచ్చిన పంచ్ లు సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉన్నాయి. 

 



Source link

Related posts

నేను రెండో పెళ్లి చేసుకోలేదు.. షాకింగ్ నిజాలు వెల్లడించిన అమలాపాల్

Oknews

కుర్చీ తాతని మడతపెట్టిన పోలీసులు..!

Oknews

సంచలన విషయాన్ని బయటపెట్టిన కృష్ణవంశీ!

Oknews

Leave a Comment