ఇప్పటి దాకా నేను చేసింది అసలు నటనే కాదు. ఆ మాట కొస్తే స్టిల్ ఈ రోజుకి నేను నేర్చుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు ఈ మాటలు అంటుంది ఎవరో కాదు.ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత(samantha)హీరోయిన్ కి కూడా స్టార్ స్టేటస్ ఉంటుందని నిరూపించిన సమంత ఎందుకు అలా మాట్లాడుతుందో చూద్దాం.
సామ్ కొన్ని రోజుల క్రితం దాకా వ్యక్తిగత, ఆరోగ్య సమస్యలతో బిజీగా పోరాడటం వలన షూటింగ్ లకి చిన్న గ్యాప్ ఇచ్చింది. ఇక ఇపుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి త్వరలోనే షూటింగ్ లో పాల్గొనబోతుంది. ఈ సందర్భంగా కొన్ని విషయాలని మీడియాతో పంచుకుంది. నెక్స్ట్ మంత్ నుంచి కొత్త సినిమా చిత్రీకరణ మొదలుపెడుతున్నాను.ఎప్పుడెప్పుడు షూటింగ్ లో పాల్గొంటానా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాను. అదే విధంగా ఆ పాత్ర కోసం ప్రత్యేకంగా సిద్ధం అవుతున్నాను. నా ప్రతి సినిమా కూడా నాలోని నటనని మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. ఎందుకంటే నేను నిత్య విద్యార్థినిని.ఈ రంగంలో తెలుసుకోవాల్సింది, చెయ్యాల్సింది చాలా ఉంది. సినిమాలో ఉన్న మ్యాజిక్కే అది. ప్రతి స్క్రిప్ట్ ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తుందని చెప్పుకొచ్చింది. అదే విధంగా మార్షల్ ఆర్ట్స్, విలు విద్య, గుర్రపు స్వారీ, కత్తి సాము లాంటి విలువిద్యలో శిక్షణ కూడా తీసుకుంటున్నానని కూడా తెలిపింది.
ఇక సామ్ చేతిలో ప్రస్తుతం మా ఇంటి బంగారం(maa inti bangaram)సిటాడెల్ హానీ, బన్నీ వెబ్ సిరీస్ ఉన్నాయి.ఈ సిరీస్ విడుదలకి సిద్ధం అవుతుండగా మా ఇంటి బంగారం షూటింగ్ కి వెళ్లనుంది. సామ్ బర్త్ డే సందర్భంగా లుక్ ని రివీల్ చేసారు. చీరకట్టులో ఒక పెద్ద తుపాకీ ని పట్టుకొని ఉన్న స్టిల్ అదిరిపోయింది. త్రలల బ్యానర్ పై సామ్ నే సొంతంగా నిర్మిస్తుంది.