మాస్ మహారాజా రవితేజ నుంచి రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న మూవీ ఈగిల్. ఆల్రెడీ టీజర్ ట్రైలర్ తో రవి తేజ అభిమానుల్లోను ప్రేక్షకుల్లోను ఈగిల్ పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన తాజా న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఈగిల్ ఇటీవలే సెన్సార్ ని కంప్లీట్ చేసుకుంది. యు / ఏ సర్టిఫికెట్ అందుకున్న ఈ మూవీ 158 నిమిషాలు అంటే రెండు గంటల ముప్పై ఎనిమిది ( 2 .38 ) నిమిషాల నిడివితో ప్రేక్షకులని కనువిందు చేయనుంది. ఒక రకంగా ఆ నిడివి రెగ్యులర్ సినిమాల నిడివితో పోల్చుకుంటే చాలా ఎక్కువనే చెప్పాలి .అలాగే ఈ మధ్య వచ్చిన కొన్ని హిట్ సినిమాల నిడివి కూడా చాలా ఎక్కువే ఉంది. అయినా సరే బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమాలు విజయం సాధించాయి. ఇప్పడు ఈగిల్ కూడా ఘన విజయం సాధిస్తుందని రవితేజ ఫ్యాన్స్ గట్టి నమ్మక్కంతో ఉన్నారు.
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై తెరకెక్కిన ఈ ఈగిల్ లో రవితేజ సరసన కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ లుగా నటించగా నవదీప్, మధుబాల, వినయ్ రాయ్, శ్రీనివాస్ అవసరాల తదితరులు కీలక పాత్రల్లో నటించారు.ఇటీవలే చిత్ర నిర్మాత టి జె విశ్వక్ ప్రసాద్ ఈగల్ సినిమా క్లైమాక్స్ ఎవరు ఊహలకి అందనంత ఎత్తులో ఉంటుందని అదొక వండర్ అని చెప్పుకొచ్చాడు.రవితేజ కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది.