చంద్రబాబును వేధించడమే జగన్ ఎజెండా
రాజకీయకక్ష సాధింపులో భాగంగా చంద్రబాబును అరెస్ట్ చేశారని లోకేశ్ ఆరోపించారు. చంద్రబాబును అరెస్టు చేస్తే టీడీపీ ఆగిపోతుందనుకున్నారని, భయం టీడీపీ బయోడేటాలో లేదన్నారు. నాడు ఇందిరాగాంధీని లెక్కచేయని టీడీపీ, జగన్ ని లెక్క చేస్తుందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టుతో తీవ్ర ఆందోళనకి గురై రాష్ట్ర వ్యాప్తంగా 157 మంది చనిపోయారని, ఆ కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందన్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తే మీ జీవితాలు మార్చేస్తా అంటే ప్రజలు జగన్ కు 151 సీట్లు ఇచ్చారని, కానీ 151 కూడా జగన్ సరిపోలేదన్నారు. టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను చేర్చుకున్నారన్నారు. సీఎం అయిన మొదటి రోజు నుంచే వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ జగన్ కక్ష సాధింపు మాత్రమే ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలను అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ ఎజెండా ఒక్కటే చంద్రబాబును, ఆయన కుటుంబ సభ్యులను వేధించడం అని ఆరోపించారు.