ఎన్నో చిత్రాల్లో విభిన్నమైన పాత్రలని పోషించిన నటి సురేఖావాణి. సినిమాలు ఉన్నా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. నిజం చెప్పాలంటే సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ పాపులారిటీ ని సంపాదించింది. తన కూతురు తో కలిసి ఆమె చేసే వీడియోస్ ఒక రేంజ్ లో సంచలనం సృష్టిస్తు ఉంటాయి. లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూ లో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
సురేఖావాణి తన కూతురు తో కలిసి పబ్ ల కి వెళ్తుంది. ఇద్దరు కలిసి మందు పార్టీ లకి కూడా హాజరవుతారు. ఆ పై వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తారు. అంతే కాకుండా ఇద్దరు కలిసి ఘాటు ఘాటు రీల్స్ కూడా చేస్తారు.ఈ మధ్యన అవి కొంచం శృతిమించాయి. దీంతో భర్త చనిపోయాక సురేఖావాణిలో విచ్చలవిడి తనం ఎక్కువయిందని కూతురు తో కలిసి ఎలా పడితే అలా తిరుగుతుందనే విమర్శలు వస్తున్నాయి.ఇప్పుడు ఈ విషయంపైనే ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న సురేఖ తన అభిప్రాయాన్ని చెప్పింది. నాకు 19 వ ఏటనే వివాహం జరిగింది. ఇరవై ఐదేళ్లకే నలభై ఐదేళ్ల దానిలా కుటుంబ బాధ్యతలు మోసాను.
ఇప్పుడు నలభై రెండు సంవత్సరాలు వచ్చాయి. అందుకే ఇరవై ఏళ్లలో ఉన్నట్టు ప్రవర్తిస్తున్నానని ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా పర్లేదని నేను చెయ్యాల్సింది చేస్తానని చెప్పింది. నా కూతురు నేను కలిసి ఇంకా ఇంకా ఎంజాయ్ చేస్తామని నా భర్త బతికి ఉన్నా కూడా ఇలాగే తిరిగేదానినని చెప్పుకొచ్చింది. మొన్ననే తిరుపతి వెళ్లి తలనీలాలు సమర్పించి వచ్చానని తనకి ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వాలని వెంకటేశ్వర స్వామిని వేడుకున్నానని కూడా చెప్పింది.