Andhra Pradesh

నిఖార్సైన రాజకీయ నేత- 1000 మందికి కోడి, క్వార్టర్ మందు పంపిణీ!-visakhapatnam ysrcp leader distributes chicken liquor bottle to 1000 people on dussehra ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


Visakhapatnam News : తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగను ఎంతో ఘనంగా చేసుకుంటారు. పండుగ నాడు కోడి కూర, కిక్కిచ్చే చుక్క ఉంటే కొందరికి పండుగే. దసరా పండుగ నాడు యజమానులు తమ వద్ద పనిచేసే వాళ్లకు బోనస్ లు ఇస్తుంటారు. ఇక రాజకీయ నేతలైతే తమ మద్దతుదారులకు మందు, ముక్క తప్పనిసరిగా ఇస్తారు. ఇలాంటి ఘటననే విశాఖలో చోటుచేసుకుంది. దసరా పండుగ నాడు విశాఖ దక్షిణ మండల వైసీపీ అధ్యక్షుడు దొడ్డి బాపు ఆనంద్‌ తమ మద్దతుదారులు, మరికొంత మందికి కోడి, లిక్కర్ బాటిల్ పంపిణీ చేశారు. ఈ వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. విశాఖ డాబా గార్డెన్స్‌లోని వైసీపీ ఆఫీసు వద్ద మంగళవారం నాడు ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా వైసీపీ నేత కోడి, మద్యం పంపిణీ చేశారు. గతంలో కేజీ మటన్‌ ఇచ్చామని, ఈ ఏడాది కోడి, క్వార్టర్‌ మందు ఇస్తున్నట్లు ఆయన బహిరంగంగానే చెప్పుకున్నారు. మద్యపాన నిషేధం అంటూ ప్రచారం చేసుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు మద్యం బాటిల్స్ పంపిణీ చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.



Source link

Related posts

కోటరీల చేతుల్లో ఏపీ ముఖ్యమంత్రులు చిక్కుతున్నారా? అందుకే ప్రజలకు దూరం అవుతున్నారా?-ap chief ministers trapped in the hands of coteries ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

AP IPS Transfers : ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీ

Oknews

ఆమె అభిమానానికి ఆటో బహుమానం, పిఠాపురంలో పవన్ గెలుపుతో మాట నిలబెట్టుకున్న సినీ నిర్మాత-a film producer who kept his word with pawans win in pithapuram ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment