Telangana

నిజామాబాద్ లో ఎంపీ అర్వింద్ వర్సెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి-జోరందుకున్న మాటల యుద్ధం-nizamabad news in telugu mp arvind versus mlc jeevan reddy before lok sabha elections ,తెలంగాణ న్యూస్



అర్వింద్ వర్సెస్ జీవన్ రెడ్డిఅసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలుపుతో కాంగ్రెస్ పార్టీకి ఊపు వ‌చ్చింది. దీంతో లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు పోటీ చేసేందుకు ఎవ‌రికి వారు త‌మ ప్రయ‌త్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయితే జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు జీవ‌న్‌రెడ్డి సోద‌రుడు.. ఎంపీ అర్వింద్‌కు వ్యతిరేకంగా క‌ర‌ప‌త్రాలు పంపిణీ చేశారు. అర్వింద్ ఓ అహంకారి అంటూ ఆరోపించారు. దీనిపై ఎంపీ అర్వింద్ త‌న‌దైన శైలిలో స్పందించారు. 2014 ఎన్నిక‌లే త‌న‌కు చివ‌రి ఎన్నిక‌ల‌ని మ‌ళ్లీ ఎమ్మెల్సీగా అవ‌కాశం ఎందుకు తీసుకున్నార‌ని ప్రశ్నించారు. ఎన్నిక‌ల్లో హుందాగా కోట్లాడుదామ‌ని, చిల్లర వ్యవ‌హారాలు మీ ఇంట్లో వాళ్లు బంద్ చేయాల‌ని హెచ్చరించారు. ఈ మేర‌కు ఓ వీడియో విడుద‌ల చేశారు. అయితే అర్వింద్ వ్యాఖ్యల‌పై నిజామాబాద్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహ‌న్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. అర్వింద్ ఓ అస‌మ‌ర్థుడ‌ని, ఎంపీగా గెలిచిన నాటి నుంచి జిల్లాలో చేసిన అభివృద్ధి ఏమీ లేద‌ని అన్నారు. ఇలాంటి వ్యక్తిని గెలించుకుంటే అభివృద్ధి జ‌ర‌గ‌ద‌నే, కోరుట్ల ప్రజ‌లు చెంప చెళ్లుమ‌నిపించేలా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడించార‌ని గుర్తు చేశారు.



Source link

Related posts

Telangana Raj Bhavan At Home By Governor Tamilisai Soundararajan CM Revanth Reddy Attends

Oknews

TS Poly CET 2024 Notification release Application Form Eligibility Fee details in telugu

Oknews

సీఎం రేవంత్ రెడ్డి-hyderabad news in telugu cm revanth reddy sensational comments on kcr harish rao water sharing between ap ts ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment