2023 చివరిలో ఎక్స్ట్రార్డినరీ మాన్ అంటూ థియేటర్ లోకి వచ్చారు హీరో నితిన్. ఏడాది దగ్గరకు వచ్చేస్తోంది. ఇప్పటి వరకు సినిమా లేదు. రెండు సినిమాలు సమాంతరంగా షూట్ లో వున్నాయి. అలా కాకుండా ఏదో ఒకటి స్టార్ట్ చేసి, ఫినిష్ చేసే ప్రయత్నం చేసి వుంటే ఈ టైమ్ కు ఓ సినిమా విడుదలై వుండేది.
నితిన్ లాంటి మిడ్ రేంజ్ హీరోలు కూడా ఏడాదికి రెండు సినిమాలు చేయకపోతే ఏలా? నాని, రవితేజ, బాలయ్య లాంటి వాళ్లను చూసి మిగిలిన హీరోలు చకచకా సినిమాలు చేయాలి.
ప్రస్తుతం రెండు సినిమాలు సెట్ మీద వున్నాయి. వెంకీ కుడుమల- మైత్రీ మూవీస్ రాబిన్ హుడ్ ఒకటి. అలాగే మరో సినిమా దిల్ రాజు నిర్మించే వేణు శ్రీరామ్- తమ్ముడు. రెండూ చాలా హై బడ్జెట్ సినిమాలే. అంటే సుమారుగా ఒక్కోటి 70 కోట్ల పైగా బడ్జెట్. నిర్మాతల లెక్కలు ఏమిటి అన్నది వారికే తెలియాలి. అది వేరే సంగతి.
డిసెంబర్ లో రాబిన్ హుడ్ సినిమా డేట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మైత్రీ సంస్థనే నిర్మిస్తున్న పుష్ప 2 సినిమా డిసెంబర్ కు వచ్చింది. ఇంకా చాలా సినిమాలు డిసెంబర్ కు డేట్ లు వేసాయి.అందువల్ల రాబిన్ హుడ్ ను ముందుకు లేదా వెనక్కు మార్చాలని చూస్తున్నారు. ముందుకు అంటే నవంబర్ సరైన నెల కాదు సినిమాలకు. అక్టోబర్ కు రావాలంటే అక్కడా సమస్యలు వున్నాయి.
అందువల్ల రాబిన్ హుడ్ ను ఫిబ్రవరికి మార్చాల్సిందే, ఒక వేళ ఏదైనా సమస్య వచ్చి పుష్ప 2 రాకపోతే అప్పుడు డిసెంబర్ లో వేసే అవకాశం వుంది. దిల్ రాజు నిర్మిస్తున్న తమ్ముడు సినిమా ఫిబ్రవరి విడుదల అని ముందే ఫిక్స్ అయ్యారు. ఒక వేళ రాబిన్ హుడ్ అక్కడికి వెళ్తే తమ్ముడు సమ్మర్ కు వెళ్తుంది.
మొత్తం మీద పుష్ప 2 విడుదల వుంటే నితిన్ సినిమా ఈ ఏడాది ఉండకపోవచ్చు.