ఇక్కడి నేతలపై కేసులు ఎందుకు లేవు…?
KVP On BJP : “ఏపీలోని ఏ మంత్రి పైనా ఎంపీలపైనా కేసులు, అరెస్టులు ఎందుకు లేవో బిజెపి చెప్పాలి. దేశం అంతా నగదు రహిత లావాదేవీలు ఉన్నా ఏపీ లో మాత్రం అంతా నగదు తోనే విక్రయాలు జరిగినా కేంద్రం పట్టించుకోదు. వైఎస్ బొమ్మ పెట్టుకుని ఓట్లు అడగడానికి వెళ్తున్న వైసిపి నేతలకు సిగ్గు లేదు. పోలవరం పై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలియటం లేదు. పోలవరం విషయంలో ఏపీ భావితరాలు జగన్ ప్రభుత్వాన్ని, గత టిడిపి ప్రభుత్వాన్ని క్షమించవు. పోలవరం పూర్తి అయితే చాలా ఎత్తిపోతల పథకాలు నిర్మించుకునే వీలుంది. 2 వేల టిఎంసి ల నీరు వినియోగించుకోవచ్చ. వైసిపి ప్రభుత్వం పోలవరాన్ని ఏటీఎమ్ లా వాడుకుంటోదని కేంద్రంలో ఉన్నత స్థాయిలోని వ్యక్తి నాతో అన్నారు. అది బ్యారేజీలా మిగిలి పోకూడదు. ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ కేంద్రం నుంచి ఏం సాధించుకునీ వచ్చారో తెలియదు. పాత అంశాలనే చెప్పి మళ్ళీ ఏపీ ప్రజలను మభ్య పెడతారు. సొంత చెల్లెలు , తల్లి పై అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకొని అసమర్థ ప్రభుత్వం ఏపిలో ఉంది. ప్రభుత్వాధినేతగా ఏపీలో కేసులు పెడితే తీసుకోరు పొరుగు రాష్ట్రంలో కేసులు పెడితే సహకరించరు. ప్రధాని మోదీ, బిజెపి పార్టీలు ఏపీ ప్రజలను నిట్టనిలువునా మోసం చేశారు” అని మండిపడ్డారు కేవీపీ.