Health Care

నిద్రపోతున్నప్పుడు అధిక రక్తపోటు.. కంటిచూపు కోల్పోయే ఛాన్స్ !


దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం ఎంతోమందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో అధిక రక్తపోటు ఒకటి. కొన్ని సందర్భాల్లో సడెన్‌గా పెరగడంవల్ల ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే బ్లడ్ ప్రెజర్ పెంచే చర్యలకు, ఆహారాలకు, అలవాట్లకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తుంటారు. ఈ మధ్య నిద్రపోతున్నప్పుడు సెడన్‌గా బీపీ పెరగడం వివిధ ఇతర వ్యాధులకు, సమస్యలకు కారణం అవుతున్నట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అధిక రక్తపోటుతో ఇంకా ఏయే సమస్యలు తలెత్తుతాయో చూద్దాం.

కంటిచూపు కోల్పోవచ్చు

నిద్రలో ఉన్నప్పుడు ఒక్కసారిగా బీపీ పెరిగితే ప్రాణహాని కూడా సంభవించవచ్చునని నిపుణులు అంటున్నారు. అందుకే హై బీపీని ‘సైలెంట్ కిల్లర్’గా అభివర్ణిస్తున్నారు. ఇది గుండె జబ్బులు, పక్షవాతం, స్ట్రోక్ ప్రమాదాలను పెంచడంతోపాటు కిడ్నీల ఫెయిల్యూర్ వరకు ప్రభావితం చేస్తుంది. నిద్రలో ఉన్నప్పుడు నార్మల్‌కంటే ఎక్కువగా బీపీ పెరగడం తరచూ కొనసాగుతుంటే కంటిచూపు మందగించడమో, కోల్పోవడమో జరగవచ్చు. అలాగే మెదడుపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీంతో జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.

స్లీప్ క్వాలిటీపై ఎఫెక్ట్

రాత్రివేళ అధికరక్తపోటు పెరగడం, నిద్రలో ఉన్నప్పుడు పెరగడం బాధితుల్లో క్రమంగా నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది. కొంత కాలం అదే కొనసాగితే నిద్రలేమికి దారితీస్తుంది. వాస్తవానికి ప్రస్తుతం జీవన శైలిలో మార్పుల కారణంగా అసలే నిద్రవేళలు తక్కువగా ఉంటున్నాయి. దీనికి అధికరక్తపోటు తోడైతే ఇక సమస్య మరింత పెరిగిపోతుంది. హైబీపీ మానవ నిద్ర చక్రానికి ప్రధానమైన ఆటంకంగా మారుతోందనే ఆందోళనలు ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తం అవుతున్నాయి.

శ్వాసలో ఇబ్బంది, తీవ్రమైన తలనొప్పి

నిద్రలో బీపీ పెరగడం హార్ట్ రేట్‌ను పెంచుతుంది. గురక అలవాటు ఉన్నవారు ఆ సమయంలో మరింత ఎక్కువగా గురక పెడతారు. దీంతో ఊపిరి పీల్చుకోవడం కష్టం అవుతుంది. ఫలితంగా శ్వాసకోశ నాళాల్లో ఆటుపోట్లు సంభవిస్తాయి. ఈ పరిస్థితిని వైద్య నిపుణులు స్లీప్ అప్నియా అని కూడా అంటారు. దీంతోపాటు బీపీ పెరగడంవల్ల శరీరంలోని నీటిశాతం చెమట రూపంలో బయటకు వెళ్తుంది. కొందరు ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్తారు. ఈ కారణంగా బాడీ డీహైడ్రేషన్‌కు గురికావడం, కిడ్నీలు ఫెయిల్ కావడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఇక బీపీ పెరిగిన వారిలో సాధారణంగా కనిపించే సమస్య తలనొప్పి. మరుసటి రోజు ఉదయం కూడా తీవ్రమైన తలనొప్పి వేధించే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అధిక రక్తపోటుతో బాధపడేవారు రాత్రివేళల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల పర్యవేక్షణ చాలా ముఖ్యం. హైబీపీని కంట్రోల్లో ఉంచుకునే జీవనశైలితో ఇబ్బందులనుంచి బయటపడవచ్చు.



Source link

Related posts

Thyroid : థైరాయిడ్ సమస్య పెరిగిపోతుందా.. కారణం ఇదేనేమో!

Oknews

లోదుస్తులు పెట్టే అమ్మాయి ర్యాక్‌లో ప్రపంచంలోనే రెండో అత్యంత ప్రమాదకరమైన విషసర్పం.. ఏం జరిగిందంటే?

Oknews

కాల్చిన వెల్లుల్లి తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

Oknews

Leave a Comment