Entertainment

నిన్న హైదరాబాద్  థియేటర్ లో రచ్చ రచ్చ చేసిన బొమ్మరిల్లు సిద్దార్ధ్ 


సిద్దార్ధ్ హీరోగా 2009 లో  వచ్చిన మూవీ ఓయ్. రిలీజ్ టైం రాంగ్ టైమో ఏమో కానీ ఓయ్ అంతగా ప్రేక్షకాదరణకి నోచుకోలేదు. కానీ మూవీ మాత్రం సూపర్ గా ఉంటుంది. ప్రేమకి సరికొత్త నిర్వచనం చెప్పిన ఆ మూవీకి నేటికీ చాలా మంది అభిమానులు ఉన్నారు. తాజాగా ఆ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సంధర్భంగా  సిద్దార్ధ్ కి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. 

   

వాలెంటైన్స్ డే కానుకగా ప్యూర్ క్లాసిక్ లవర్ స్టోరీ  ఓయ్  మొన్న 14 న  రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రీ రిలీజ్ అయ్యింది. విడుదలైన అన్ని చోట్ల  సూపర్ రెస్పాన్స్ ని అందుకొని మంచి వసూళ్లనే సాధిస్తుంది. ముఖ్యంగా యూత్ అయితే మూవీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.ఇక వాళ్ళ ఆనందాన్ని రెట్టింపు చేస్తు సిద్దార్ధ్ నిన్న హైదరాబాద్ లోని శాంతి థియేటర్ కి వెళ్ళాడు. దీంతో సిద్దార్ధ ని చూసిన ప్రేక్షకుల ఆనందం అంతా ఇంతా కాదు. మూవీ ఎలా ఉందని సిద్దార్ధ్ అడిగితే అందరు కూడా సూపర్ గా ఉందన్నారు. దీంతో వాళ్ళ ఆనందాన్ని రెట్టింపు చేసేలా సిద్దార్ధ్ మూవీలోని ఒక పాటని కూడా పాడటంతో ఇక అందరు ఆనందంతో ఎగిరి గంతేశారు. సోషల్ మీడియాలో  ఇప్పుడు సిద్దార్ధ్ విజువల్స్ వైరల్ గా మారాయి. 

ఇక ఓయ్ కి  ఫస్ట్  రిలీజ్ లో కూడా రాని క్రేజ్ సెకండ్ రిలీజ్ లో వస్తుంది. అసలు సినిమాలోని క్యారక్టర్ లు డైలాగ్ చెప్పేముందే  చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు ముందుగానే డైలాగ్స్ ని చెప్తున్నారు.అలాగే ఫస్ట్ రిలీజ్ లో చూసిన వాళ్ళు  ఇప్పుడు  ఓయ్ చూసి ఇదేంటి సినిమా చాలా కొత్తగా ఉందని కూడా అనుకుంటున్నారు. సిద్దార్ధ్ సరసన షామిలి హీరోయిన్ గా చెయ్యగా సునీల్,సప్తగిరి, ప్రదీప్ రావత్ తదితరులు నటించారు. ఆనంద్ రంగ దర్శకుడుగా వ్యవహరించగా  డివివి దానయ్య నిర్మించాడు. 



Source link

Related posts

యూట్యూబ్ స్టార్ ఇక లేరు – Telugu Shortheadlines

Oknews

కాలం వేగంగా పరుగెడుతోంది.. కానీ ప్రేమ మాత్రం

Oknews

లెజండరీ హీరో.. లెజండరీ డైరెక్టర్‌ కలిసి చేస్తున్న సినిమా! 

Oknews

Leave a Comment