త్వరలో గ్రూప్-4 ఫలితాలుఇటీవల నియామకమైన కొత్త టీఎస్పీఎస్సీ బోర్డు ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెట్టింది. ఇప్పటివరకు ఆగిపోయిన పనుల్లో కదలిక స్టార్ట్ అయింది. ఇప్పటికే పూర్తైన రాత పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు బోర్డు కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వం అనుమతి తీసుకుని నిలిచిపోయిన పలు పరీక్షలను నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే వారం రోజుల్లోనే గ్రూప్-4 ఫలితాలు విడుదల చేసేందుకు ముమ్మరం చేసింది. ఇక రాష్ట్రంలో 8,180 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ గ్రూప్ – 4 నోటిఫికేషన్ ఇవ్వగా…..2023 జులై 1న పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష కోసం మొత్తం 9,51,205 మంది అప్లై చేయగా….అందులో 7,62,872 మంది పేపర్ -1 రాయగా….7,61,198 మంది పేపర్ -2 పరీక్ష రాశారు. ఇక 5 నెలల క్రిందటే ఫైనల్ కీ విడుదల కాగా….గ్రూప్ -4 తుది ఫలితాలు మాత్రం ఇప్పటివరకు విడుదల కాలేదు. అయితే ఫలితాలు విడుదల చేసే ప్రక్రియ మాత్రం బోర్డు పూర్తి చేయగా…మరో వారం రోజుల్లో గ్రూప్ – 4 ఫలితాలను విడుదల చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తుంది. ముందుగా జనరల్ ర్యాంకు లిస్టును ప్రకటించి ఆ తర్వాత పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థికి ర్యాంకు కేటాయించనున్నారు. మార్కుల ఆధారంగా జిల్లాలు, జోన్లవారీగా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
Source link
previous post