Entertainment

నివేదా దగ్గర ఈ టాలెంట్‌ కూడా ఉందా.. కప్పు కొట్టేసిందిగా!


కొందరు తారలు సినిమాల్లోనే కాదు ఇతర రంగాల్లోనూ తన ప్రతిభను చూపిస్తూ రాణిస్తుంటారు. హీరోల విషయానికి వస్తే తమిళ్‌ హీరో అజిత్‌ కార్‌ రేసింగ్‌లో ఎంత ఎక్స్‌పర్టో అందరికీ తెలిసిందే. ఎన్నో ఛాంపియన్‌ షిప్స్‌లో పాల్గొన్న అజిత్‌ ఇప్పటికీ అందులో కొనసాగుతుంటారు. ఇప్పుడు టాలీవుడ్‌లో హీరోగా కొనసాగుతున్న సుధీర్‌బాబు ఒకప్పుడు బ్యాడ్‌మింటన్‌ ప్లేయర్‌, హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న రితిక సింగ్‌ బాక్సింగ్‌లో ఛాంపియన్‌… ఇలా చాలా మంది తమకి ఎంతో ఇష్టమైన స్పోర్ట్స్‌లోనూ తమ ఉనికిని చాటుకుంటూ ఉంటారు.

తాజాగా హీరోయిన్‌ నివేదా పేతురాజ్‌ అలాంటి ఘనతను సాధించింది. తమిళ్‌లో ఎన్నో సినిమాల్లో నటించిన నివేదా డబ్బింగ్‌ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత చిత్రలహరి, పాగల్‌, అల వైకుంఠపురములో.., దాస్‌ కా ధమ్కీ, విరాటపర్వం చిత్రాల్లో నటించి తెలుగులోనూ మంచి పేరు తెచ్చుకుంది. ఈమెకు నటనతో పాటు బ్యాడ్మింటన్‌లో కూడా ప్రవేశం ఉంది. అలాగే ప్రొఫెషనల్‌ రేసర్‌ కూడా. ఇటీవల ఓ ఛాంపియన్‌ షిప్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కప్పు గెలుచుకుంది. ‘డబుల్స్‌లో కప్‌ కొట్టేశా..’ అంటూ కప్‌ను కిస్‌ చేస్తున్న ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడు వాట్‌ నెక్స్‌ట్‌ అంటోంది. నివేదాకి కార్‌ రేసింగ్‌లో కూడా ప్రవేశం ఉంది కాబట్టి నెక్స్‌ట్‌ అందులో కూడా కప్‌ కొట్టెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నట్టుంది. స్పోర్ట్స్‌లో ఇంత టాలెంట్‌ ఉన్న నివేదాతో స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు చేస్తే బాగుంటుందని మేకర్స్‌కి సూచిస్తున్నారు నెటిజన్లు. 

ప్రస్తుతం స్పోర్ట్స్‌పైనే కాన్‌సన్‌ట్రేషన్‌ ఉంచిన నివేదా సినిమాల గురించి అంతగా పట్టించుకుంటున్నట్టు లేదు. టాలీవుడ్‌ హీరో విశ్వక్‌సేన్‌తో పాగల్‌, దాస్‌ కా ధమ్కీ సినిమాల్లో నటించింది. ఇప్పుడు దాస్‌ కా ధమ్కీ సెకండ్‌ పార్ట్‌ ఉంటుందని విశ్వక్‌సేన్‌ ప్రకటించాడు. మరి ఈ సినిమాలో నివేదా నటిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. 

 



Source link

Related posts

జిమ్ లో ఎన్టీఆర్ తో హాట్ బ్యూటీ.. పెద్ద ప్లానే ఇది!

Oknews

కల్కి2 లో చంద్రముఖి… భారీ రెమ్యూనరేషన్

Oknews

శర్వానంద్ మామూలోడు కాదు..పెద్ద రేస్ రాజా!  

Oknews

Leave a Comment