Health Care

నీటి అడుగులో శ్వాస తీసుకోకుండా ఆరు నిమిషాలు.. సినిమా కాదు.. రియల్


దిశ, ఫీచర్స్ : మనం చాలా సినిమాల్లో చాలా రకాల స్టంట్లు చూస్తూనే ఉంటాం. ఎత్తైన కొండ పై నుంచి మరో కొండ పై దూకడం. నీటి అడుగుల్లో నిమిషాల తరబడి ఉండడం. కానీ నిజ జీవితంలో ఇలాంటివి చేయడం అంటే చాలా రిస్క్ తో కూడుకున్న పని అని చెప్పాలి. ముఖ్యంగా శ్వాస తీసుకోకుండా కొన్ని నిమిషాల పాటు అలాగే ఉండడం అంటే చాలా కష్టం. ఒక వేళ అలా ఊపిరి పీల్చకుండా ఉండాలంటే కొన్ని సెకన్ల పాటు మాత్రమే ఉండగలం. లేదా వ్యాయామం చేసేవారు 1 నిమిషం పాటు ఆపుకోగలరు. రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసే వ్యక్తులు 2 లేదా 3 నిమిషాలు ఊపిరి పీల్చుకోకుండా ఉండగలరు. ఇదే విన్యాసాన్ని నీటి అడుగుభాగంలో చేయాలంటే కష్టంతో కూడుకున్న పనిగా పేర్కొంటారు.

కానీ ఓ వ్యక్తి 2 – 3 నిమిషాలు కాదు ఏకంగా 6 నిమిషాల పాటు నీటి అడుగులో ఉండి ఊపిరిని బిగపట్టాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో స్విమ్మింగ్ పూల్ దిగువన ఓ వ్యక్తి వచ్చి నిలుచున్నాడు. తనతో పాటు స్విమ్మింగ్ ఫూల్ లోకి దిగిన వ్యక్తుల్లో ఇద్దరు ఒకటిన్నర నిమిషాల తర్వాత పైకి వెళ్లిపోయారు. మరో వ్యక్తి రెండు నిమిషాలు గడిచిన వెంటనే పైకి వెళ్లి పోయాడు. రెండున్నర నిమిషాల తర్వాత నాలుగవ వ్యక్తి కూడా పైకి వెళ్తాడు. కానీ ఒక వ్యక్తి మాత్రం మొత్తం 6 నిమిషాల పాటు నీటిలోనే ఉన్నాడు. ఈ వీడియోను @TheFigen_ అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 1.8 మిలియన్లు వీక్షించారు.





Source link

Related posts

కొత్తిమీర తాజాగా ఉండాలంటే ఈ టిప్స్ పాటించాలి

Oknews

లైంగిక జీవితంపై ప్రభావం చూపుతున్న వ్యాధులు..కంట్రోల్లో ఉంచుకోకపోతే కష్టమే!

Oknews

క్యాట్‌వాక్ సోయగాలు.. ర్యాంప్ వాక్ హొయలు.. పర్యావరణంపై ‘ఫ్యాషన్’ ఎఫెక్ట్ !

Oknews

Leave a Comment