ఏ హీరోకైనా స్టార్ స్టేటస్ రావాలంటే మినిమమ్ నాలుగైదు సినిమాలు అయినా పడుతుంది. ఈ సూత్రాన్ని రివర్స్ చేసి రెండో సినిమాకే స్టార్ అయిన హీరో విజయ్ దేవరకొండ.పైగా ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ కూడా లేదు.అందుకే ఆయన్ని చాలా మంది అభిమానిస్తుంటారు. తాజాగా ముంబైలో జరిగిన ఒక సంఘటన విజయ్ రేంజ్ ని చెప్తుంది.
ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ముంబై లో ఒక ఈవెంట్ ని నిర్వహించింది. తమ అప్ కమింగ్ సినిమాలకి సంబంధించి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఇండియన్ సినీ పరిశ్రమకి చెందిన చాలా మంది ప్రముఖులు పాల్గొన్నారు. వీళ్లల్లో ప్రముఖ స్టార్ హీరోలైన విజయ్ దేవరకొండ, షాహిద్ కపూర్ కూడా ఉన్నారు. విజయ్ చేసిన అర్జున్ రెడ్డి వల్లే నాకు సూపర్ హిట్ సినిమా వచ్చింది. ఒక వేళ విజయ్ ఆ మూవీ చేసుండకపోతే నాకు కబీర్ సింగ్ లేదు అంటు విజయ్ కి ముద్దు పెట్టాడు. ఇప్పుడు ఈ సంఘటన చిన్న సైజు వైరల్ అవుతుంది.
అర్జున్ రెడ్డి మూవీ కబీర్ సింగ్ గా హిందీలో రీమేక్ అయిన విషయం అందరకి తెలిసిందే. అలాగే తెలుగులో ఎంత పెద్ద హిట్ అయ్యిందో హిందీలో కూడా అంతే పెద్ద హిట్ అయ్యింది. అప్పటి వరకు ప్లాప్ ల్లో ఉన్న షాహిద్ సినీ కెరీర్ కి కూడా కబీర్ సింగ్ ఎంతగానో హెల్ప్ చేసింది. తెలుగు,హిందీ కి సందీప్ రెడ్డి నే దర్శకత్వం వహించాడు. ఇక విజయ్ అప్ కమింగ్ మూవీ ఫ్యామిలీ స్టార్ ని అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది.