EntertainmentLatest News

నెక్స్ట్ పాన్ ఇండియా స్టార్.. నాని రూటే సెపరేటు..!


ఈ జనరేషన్ లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ గా ఎదిగిన యంగ్ హీరోలలో న్యాచురల్ స్టార్ నాని ఒకడు. నాని సినిమా వస్తుందంటే ఖచ్చితంగా విషయం ఉంటుందనే అభిప్రాయాన్ని ప్రేక్షకుల్లో కలిగేలా చేసుకోగలిగాడు. అందుకే హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా.. నాని సినిమాలకు చెప్పుకోదగ్గ వసూళ్లు వస్తుంటాయి. ఇప్పటికే తెలుగులో సినిమా సినిమాకి అభిమానులను పెంచుకుంటూ న్యాచురల్ స్టార్ గా ఎదిగిన నాని.. ఇతర భాషల్లోనూ తన మార్కెట్ ని పెంచుకునే పనిలో పడ్డాడు. ప్రస్తుతం నాని జోరు చూస్తుంటే త్వరలోనే పాన్ ఇండియా స్టార్ గా అవతరించే అవకాశముంది.

నానికి ఇప్పటికే ఇతర సౌత్ భాషల్లో మంచి గుర్తింపు ఉంది. ఓ వైపు సౌత్ లో తన మార్కెట్ ని పెంచుకుంటూనే, మరోవైపు నార్త్ ప్రేక్షకులకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నాడు నాని. ఇప్పటిదాకా తమ సినిమాలతో నార్త్ లోనూ మంచి వసూళ్లు రాబట్టి.. పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్న హీరోలు ఉన్నారు. అయితే నాని రూట్ మాత్రం సెపరేట్ అన్నట్టుగా ఉంది. ఇటీవల నాని కూడా తన సినిమాలను పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్నాడు. అయితే నార్త్ లో నాని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా మ్యాజిక్ చేయడంలేదు. కనీస వసూళ్లకే పరిమితం అవుతున్నాయి. అయినప్పటికీ ఓటీటీ ద్వారా నాని పలు భాషల ప్రేక్షకులకు చేరువ అవుతున్నాడు. 

నాని సినిమాలకు ఓటీటీలో విశేష ఆదరణ లభిస్తోంది. ఆయన గత చిత్రాలు ‘శ్యామ్ సింగరాయ్’, ‘అంటే సుందరానికీ’, ‘దసరా’.. ఇతర భాషల ప్రేక్షకులను ఓటీటీలో ఎంతగానో అలరించాయి. ఇక ఇటీవల విడుదలైన ‘హాయ్ నాన్న’ అయితే ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా హిందీ వెర్షన్ కి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా కంటెంట్ కి, నాని పర్ఫామెన్స్ కి ఫిదా అవుతున్న నార్త్ ఆడియన్స్.. ఆయన గత చిత్రాలను చూడటానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. వారు నాని గత చిత్రాలను కూడా చూసి, మరింత ఇంప్రెస్ అయితే.. నెక్స్ట్ నుండి నాని సినిమాలను థియేటర్లలో కూడా ఆదరించే అవకాశముంది. ఇలాగే కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో నాని అలరిస్తే.. బలమైన పునాదులు వేసుకుంటూ సైలెంట్ గా భవిష్యత్ లో పాన్ ఇండియా స్టార్ గా అవతరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

మరోవైపు పాన్ ఇండియా వైడ్ గా నానికి వస్తున్న గుర్తింపుని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ముందుగానే అంచనా వేసింది. ‘శ్యామ్ సింగరాయ్’ నుంచి నాని నటిస్తున్న అన్ని సినిమాల ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్సే సొంతం చేసుకుంటోంది. నాని తదుపరి చిత్రం ‘సరిపోదా శనివారం’ రైట్స్ ని ఏకంగా రూ.45 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం.



Source link

Related posts

‘దసరా’ ఔట్.. త్వరలోనే ‘గీత గోవిందం’ కూడా…

Oknews

అప్పుడు 'శక్తి'.. ఇప్పుడు 'కల్కి'..!

Oknews

అఖండ 2 కి తమన్ లేకపోతే ఎలా!బాలయ్య కల్పించుకోవాలంటున్న ఫ్యాన్స్ 

Oknews

Leave a Comment