నెలరోజులపాటు జాజికాయ నీరు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?


posted on Dec 27, 2024 9:30AM

 

జాజికాయ మసాల దినుసుల్లో ఒకటి.  ఇది చాలా రకాల వంటల తయారీలో ఉపయోగిస్తారు.  కేవలం వంటల్లోనే కాకుండా పురాతన కాలం నుండి వైద్యంలోనూ, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లోనూ ఔషదంగా కూడా జాజికాయను ఉపయోగిస్తున్నారు. జాజికాయ నీళ్లను నెలరోజుల పాటు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలిస్తే షాకవుతారు.

పోషకాలు..

జాజికాయ నీళ్లను నెల రోజులు క్రమం తప్పకండా తాగడం వల్ల కలిగే లాభాలు తెలుసుకునే ముందు జాజికాయలో ఉండే పోషకాలు తెలుసుకోవాలి.  జాజికాయలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

ప్రయోజనాలు..

జాజికాయలో ఉండే పోషకాలు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.  రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు జాజికాయ నీటిని తాగాలి.  దీని వల్ల నిద్ర బాగా వస్తుంది.

జాజికాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు,  యాంటీ ఇన్ప్లమేటరీ లక్షణాలు.. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.  ఇవి శరీరంలో ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడతాయి.

జాజికాయ నీరు శరీరంలో కొవ్వును బర్న్ చేయడంలో సహాయపడుతుంది. జాజికాయ  నీరు తాగుతుంటే బరువు తగ్గుతారు.  శరీరాంలో ఉంటే టాక్సిన్లను తొలగించడంలో కూడా ఇది సహాయపడుతుంది.

జాజికాయ వాసన చాలా ఆహ్లాదంగా ఉంటుంది.  ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.  ఫలితంగా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. జాజికాయ నీళ్లు తాగుతుంటే మానసికంగా రిలాక్స్ గా ఉంటారు.

జాజికాయ నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.  దీంతోపాటు ఎసిడిటీ, మలబద్దకం,  కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.  జాజికాయ నీరు రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే పొట్ట శుభ్రంగా ఉంటుంది.


                                                 *రూపశ్రీ.



Source link

Leave a Comment