నారాయణ విద్యాసంస్థలు జీఎస్టీ(GST) ఉల్లంఘనలకు పాల్పడినట్లు రవాణా శాఖ ఇచ్చిన ఫిర్యాదుతో బాలాజీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. జీఎస్టీ పోర్టల్ నమోదు చేసినట్లు NSpira సంస్థ నెల్లూరు హరనాథపురంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ… ఆ సంస్థ అకౌంట్లను హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆఫీసులో నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించామన్నారు. ఎన్.స్పిరా సంస్థ నారాయణ సంస్థలకు చెందిన పాఠశాలలు, కళాశాలలకు సేవలు అందిస్తున్నారు. ఇది ప్రధానంగా నారాయణ సంస్థలకు ఆహారం, బస, భద్రత, మౌలిక సదుపాయాలు, బస్సులు, హౌస్ కీపింగ్ సేవల్ అందిస్తుందన్నారు. అయితే ఈ సంస్థ మోటార్ వెహికల్ చట్టం ప్రకారం వాహనాల పన్నులు చెల్లించకుండా… తక్కువ పన్ను స్లాబ్ రేట్లు పొందేందుకు కొన్ని అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు.