EntertainmentLatest News

నేటికీ నాకు డాన్సింగ్ లో ఇన్స్పిరేషన్ ఆ హీరోనే  


శరీరాన్ని రబ్బర్ లా వంచి డాన్స్ చెయ్యడంలో ఆయన దిట్ట. కళ్ళు ఆర్పి తెరిచే లోపు  మెరుపు వేగంతో కాలు కదిపి చూపరులని మంత్రముగ్ధులు చెయ్యడంలో ఆయనకి ఆయనే సాటి. స్క్రీన్ మీద హీరోలు చేత స్టెప్ లు వేయించి ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల చేత  థియేటర్స్ లో ఈలలు కూడా  వేయించిన ఘనుడు.ఆయన ఎవరో కాదు ఇండియన్  మైకేల్ జాక్సన్ గా కీర్తి గడించిన ప్రభుదేవా.తాజాగా తనకి  డాన్స్ లో ఇన్స్పిరేషన్ ఇచ్చిన వ్యక్తి గురించి  చెప్పాడు.

ప్రభుదేవా  తన ట్విటర్ లో చిరంజీవి డాన్స్ చేస్తున్న వీడియోని షేర్ చేసాడు. చిరంజీవి డాన్స్ టీవీలో వస్తుంటే ప్రభుదేవా ఆ డాన్స్ ని చూపిస్తు ఏంటి ఆ గ్రేస్ అని చూపిస్తు  మెగా మెగా మెగాస్టార్ డాన్స్ అండ్ వర్కవుట్ సూపర్  నాకు డాన్స్ లో ఇన్స్పిరేషన్ చిరంజీవి అనే క్యాప్షన్ ఉంచాడు.ఇప్పుడు ప్రభుదేవా చేసిన ఈ ట్వీట్ తో మెగా ఫ్యాన్స్ ఆనందం అయితే మాములుగా లేదు.ఇక ప్రభుదేవా చూపించే వీడియోలో చిరు ఠాగూర్ సినిమాలోని మన్మధ మన్మధ సాంగ్ కి చేసిన వీణ స్టెప్ ప్లే అవుతుంది. ఇప్పడు ఈ పిక్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ లో ఉంది.



 

ఇక ప్రభుదేవా  చిరు కాంబోలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆయా సినిమాల్లోని చిరు డాన్స్ కి థియేటర్స్ దద్దరిల్లిపోయేవి. ఆ సాంగ్స్ లోని స్టెప్ లు తెలుగు సినిమా రంగంలో డాన్సింగ్ విషయంలో కొత్త ఒరవడిని కూడా సృష్టించాయి.అలాగే డాన్సుల్లో చిరు చేసే ఎన్నో మేనరిజమ్స్ ని నేటికీ చిరు ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా చేస్తుంటారు. ఘరానా మొగుడు సినిమాలోని  బంగారు కోడి పెట్ట సాంగ్ స్టెప్స్ నే అందుకు ఒక ఉదాహరణ.ఇప్పుడు ప్రభుదేవా పోస్ట్ తో  చిరు రాబోయే మూవీ  విశ్వంభర లో ప్రభుదేవా ఒక పాటకి అయినా  కొరియోగ్రఫీ ని అందించాలని  ఫ్యాన్స్ కోరుకుంటున్నారు .ప్రభుదేవా డైరెక్షన్ లో చిరంజీవి శంకర్ దాదా జిందాబాద్ అనే సినిమా చేసాడు.



Source link

Related posts

విజయ్‌ దేవరకొండకి హ్యాండిచ్చిన శ్రీలీల… రీజన్‌ అదేనట!

Oknews

ప్రతి సినిమాకీ ఇది అవసరమా… ఏమిటీ సీక్వెల్స్‌ గోల?

Oknews

అగ్ని కణకలై..మానవ బాంబులై..ఎవడు మిగులుతాడో చూస్తా.!

Oknews

Leave a Comment