“వైఎస్సార్ వాహన మిత్ర” పథకానికి సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కొరకు జగనన్నకు చెబుదాం 1902 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఈ ఏడాది వాహన మిత్ర అందుకునే లబ్ధిదారుల్లో వర్గాల వారీగా, 2023-24 సంవత్సరానికి – ఎస్సీలు 67,513, ఎస్టీలు 11,497, బీసీలు 1,51,271, మైనార్టీలు (ముస్లిం, క్రిస్టియన్లు) 5,100, కాపు 25,046, ఇతరులు 15,504 ఉన్నారు. మొత్తం 2,75,931 మందికి వాహన మిత్ర ద్వారా ఆర్ధిక సాయం అందనుంది.