పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న నయా మూవీస్ లో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ మూవీ మీద ఫ్యాన్స్ లోను ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. కొన్ని రోజుల నుంచి ఈ మూవీ గురించి ఎలాంటి అప్ డేట్ రావడం లేదు. ఈ క్రమంలో ఇప్పుడు ఉస్తాద్ నుంచి వస్తున్న ఒక న్యూస్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
మే 11 2023 న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫస్ట్ గ్లింప్స్ వచ్చింది. పవన్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులని కూడా అది ఎంతగానో అలరించింది.అలాగే మరో సారి పవన్ తన పవర్ ఫుల్ యాక్టింగ్ ని చూపించబోతున్నాడనే విషయం కూడా అర్ధమైంది. ఈ సారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోయిద్ది అంటు పవన్ చెప్పిన డైలాగ్ నేటికీ మారుమోగిపోతు ఉంది. సోషల్ మీడియాలో ఆ గ్లింప్స్ రికార్డులు కూడా సృష్టించింది. ఇప్పడు సరికొత్త రికార్డులు సృష్టించడానికీ మరో గ్లింప్స్ రాబోతుంది. భగత్స్ బ్లేజ్ అంటు నేడు సాయంత్రం 4:45 గంటలకు రిలీజ్ కానుంది. మేకర్స్ ఈ విషయాన్ని పోస్టర్ ద్వారా కూడా వెల్లడించారు. ఫ్యాన్స్ అయితే ఎంతో ఆనందంతో ఉన్నారు.ఎప్పుడెప్పుడు ఫోర్ ఫార్టీ ఫైవ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.
హరీష్ శంకర్, పవన్ కాంబోలో ఇంతకు ముందు గబ్బర్ సింగ్ వచ్చింది. ఈ మూవీకి ముందు పవన్ కి ఒక పది సంవత్సరాల పాటు సరైన హిట్ కూడా లేదు.అలాంటి కాంబోలో రాబోతున్న ఉస్తాద్ కోసం ఫ్యాన్స్ రీగర్ గా వెయిట్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది. పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు.