ఏపీపీఎస్సీ ఇతర నోటిఫికేషన్లు
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ఇటీవల ఆరు నోటిఫికేషన్లు(APPSC Notifications) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 33 పోస్టులను భర్తీ చేయనుంది. ఏపీ కాలుష్య నియంత్రణ మండలిలో ఎనలిస్ట్ గ్రేడ్-2 కింద 18 పోస్టులు, రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో 19 పోస్టులు టౌన్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ 7 పోస్టులు, మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్‌లో లైబ్రేరియన్ 4 పోస్టులు, వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఎబుల్డ్ ట్రాన్స్ జెండర్, సీనియర్ సిటిజన్ సర్వీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ 2 పోస్టులు, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్- 1 పోస్టు, భూగర్భ నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ కెమిస్ట్-1 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లలో పేర్కొంది. పోస్టుల సంఖ్యను ప్రభుత్వం ఖరారు చేసింది.