దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెత సినిమా రంగానికి కరెక్ట్ గా వర్తిస్తుంది. క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలంటారు. ఎందుకంటే ఇక్కడ ఓవర్ నైట్ వచ్చిన క్రేజ్ అదే ఓవర్ నైట్ పోవచ్చు. కానీ తేజ సజ్జ మాత్రం ఆ లెక్కలు నాకనవసరం నాకు కావాల్సింది మాత్రం అదే అని అంటున్నాడు.
హనుమాన్ తో తేజ పాన్ ఇండియా లెవల్లో స్టార్ అయిపోయాడు.ఇందులో ఎవరకి ఎలాంటి డౌట్ లేదు. దీంతో వరుసగా సినిమాల ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి.చాలా మంది తెలుగు దర్శకులు నిర్మాతలు తేజ తో సినిమా చెయ్యాలని ఆరాటపడుతున్నారు. ఆ లిస్ట్ లో హిందీ మేకర్స్ కూడా ఉన్నారు. పైగా తేజ సజ్జ అడిగింత రెమ్యునరేషన్ కూడా ఇవ్వడానికి అందరు సిద్ధంగా ఉన్నారు. కానీ తేజ మాత్రం నాకు ఫస్ట్ కథతో పాటు కంటెంట్ నచ్చాలని షరతు పెడుతున్నాడు. రెమ్యునరేషన్ కొంచం అటు ఇటుగా ఉన్నా కూడా పర్లేదని అంటున్నాడు. ఆల్రెడీ కథలు వింటున్న తేజ తనకి నచ్చని వాటిని రిజెక్ట్ చేస్తున్నాడు.
ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పై కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఒక సినిమాకి ఒప్పుకున్నాడు.అలాగే హనుమాన్ సీక్వెల్ గా రాబోతున్న జై హనుమాన్ లోను నటించబోతున్నాడు. హనుమన్ అయితే ఇంకా కొన్ని థియేటర్స్ లో మంచి కలెక్షన్స్ తో ముందుకు దూసుకుపోతుంది. త్వరలోనే 50 రోజులుని పూర్తి కూడా చేసుకోబోతుంది. వరల్డ్ వైడ్ గా ఇప్పటికే 300 కోట్ల కలెక్షన్ల పైనే సాధించింది.