నేనింకా కమిట్ అవ్వలేదు


ఓవైపు కొంతమంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మరోవైపు ఇంకొంతమంది హీరోయిన్లు ప్రేమలో పడుతున్నారు. చాలామంది హీరోయిన్లు తమ ప్రేమను ఓపెన్ గా బయటకు చెబుతున్నారు. మరికొందరు మాత్రం సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నారు.

అయితే హీరోయిన్ నభా నటేష్ మాత్రం పైన చెప్పుకున్న ఏ సెక్షన్ లోకి రానంటోంది. ఆమెకు ఎలాంటి ఎఫైర్లు లేవంట. ఎవరితో డేటింగ్ చేయడం లేదంట. ఇప్పటివరకు కమిట్ అవ్వలేదంట. తనకు బాయ్ ఫ్రెండ్ ఎవ్వరూ లేరని ప్రకటించింది ఈ ముద్దుగుమ్మ.

యాక్సిడెంట్ నుంచి పూర్తిగా కోలుకున్న నభా నటేష్, డార్లింగ్ సినిమాతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. తను మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నానని, అందుకే మూవీస్ కు మాత్రమే కమిట్ అవుతున్నానని, మరో వ్యక్తికి టైమ్ ఇచ్చే పొజిషన్ లో లేనని అంటోంది.

బోనాలు సందర్భంగా సోషల్ మీడియాలో చిట్ చాట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అందరూ బోనాలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారంటూ ఆరాలు తీసింది. తను మాత్రం బెంగళూరులో ఉంటూ, ఇంట్లో సున్నుండలు చేసి బోనాలు జరుపుకుందంట.

The post నేనింకా కమిట్ అవ్వలేదు appeared first on Great Andhra.



Source link

Leave a Comment