Entertainment

నేనింతే సీక్వెల్.. హీరో రవితేజ కాదు!


మాస్ మహారాజ రవితేజ, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ కి ఉండే క్రేజే వేరు. వీరి కలయికలో ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’, ‘ఇడియట్’, ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘నేనింతే’, ‘దేవుడు చేసిన మనుషులు’ వంటి సినిమాలు వచ్చాయి. అయితే వీటిలో ‘నేనింతే’ సినిమాకి ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది.

సినిమా వాళ్ళ కష్టాలను కళ్ళకు కట్టినట్టు చూపించిన చిత్రం ‘నేనింతే’. 2008 డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించనప్పటికీ.. తర్వాత ప్రేక్షకులకు అభిమాన చిత్రంగా మారి కల్ట్ స్టేటస్ సాధించింది. పూరి మార్క్ హీరో క్యారెక్టరైజేషన్, డైలాగ్ లతో ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని విధంగా సినిమా ఉంటుంది. ఇక రవితేజ తనదైన నటనతో పూరి రచనకు ప్రాణం పోశాడు. ఈ సినిమాకి ఉత్తమ నటుడిగా రవితేజ, ఉత్తమ డైలాగ్ రైటర్ గా పూరీ జగన్నాథ్ నంది అవార్డులను గెలుచుకోవడం విశేషం. అలాంటిది ఈ మూవీ సీక్వెల్ లో నటించాలని ఉందని ఒక కుర్ర హీరో తన మనసులో మాట బయటపెట్టాడు. ఆ హీరో ఎవరో కాదు డైరెక్టర్ పూరి తనయుడు ఆకాష్ పూరి.

చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఆకాష్.. ‘ఆంధ్రాపోరి’, ‘మెహబూబా’, ‘రొమాంటిక్‌’, ‘చోర్ బజార్’ వంటి సినిమాల్లో హీరోగా నటించాడు. అయితే ఇవేవీ అతనికి సరైన విజయాన్ని అందించలేదు. పైగా వీటిలో ‘మెహబూబా’కి దర్శకుడు పూరి నే కావడం విశేషం. అయితే రీసెంట్ గా ఆకాష్ ‘నేనింతే’ సీక్వెల్ లో నటించాలని ఉందని చెప్పాడు. 

తాజాగా మీడియాతో ముచ్చటించిన ఆకాష్.. ‘బుజ్జిగాడు-2’లో నటిస్తారా అనే ప్రశ్నకు “ప్రేక్షకులు అంతగా ఓన్ చేసుకున్న అలాంటి సినిమాను టచ్ చేయకపోవడమే బెటర్” అని చెప్పాడు. అయితే తన తండ్రి డైరెక్ట్ చేసిన సినిమాల్లో ‘నేనింతే’ అంటే ప్రత్యేకమైన అభిమానమని, ఆ సినిమా సీక్వెల్ లో నటించాలని ఉందని తెలిపాడు. మరి పూరి త్వరలోనే తన తనయుడితో ‘నేనింతే-2’ ప్లాన్ చేస్తాడేమో చూడాలి.



Source link

Related posts

ఏందబ్బా.. ముద్దు పెడితే ఏడుస్తారబ్బా!

Oknews

విడాకులు తీసుకున్న ఆ హీరోయిన్ ని సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్!

Oknews

హీరో నాని గరం గరం.. వాళ్ళని చంపేస్తాడంట 

Oknews

Leave a Comment