నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి రావు గారు. ఢీ సినిమాలో బ్రహ్మానందం చెప్పే డైలాగ్ నేటికీ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. ఇప్పుడు ఈ డైలాగ్ ని ప్రముఖ నటి, యాంకర్ అయిన అనసూయ (anasuya bharadwaj) భరద్వాజ్ చెప్తుంది. నన్ను ఎందుకు ప్రతి దాంట్లోకి లాగుతుంటారు అని అంటుంది. పైగా నేను ఆంటీ అయితే మీ ఇంట్లో ఒకసారి అడుగు అని కూడా అంటుంది. అసలు విషయం ఏంటో చూద్దాం.
బడా బడా హీరోయిన్లకి ఎంత క్రేజ్ ఉందో అనసూయ కి కూడా అంతే క్రేజ్ ఉంది. ఇందులో నో డౌట్. తను చేసిన సినిమాలు అలాంటివి మరి. ఇక తాజాగా సోషల్ మీడియా వేదికగా కార్తీక్ అనే వ్యక్తి విజయ్ దేవరకొండ(vijay devarakonda) ని కోట్ చేస్తు ఒక కామెంట్ చేసాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ అనసూయ పేరుని ఉదాహరణగా చెప్పాడు. పైగా ఆంటీ అని సంబోధించాడు. దీంతో అనసూయ తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చింది. ఎందుకు కార్తీక్ గారు ప్రతి సారి నన్ను లాగుతున్నారు. ఎవరు ఎలాంటి మాఫియా చేస్తు లబ్ది పొందుతున్నారో ఎప్పుడో చెప్పేసాను. ప్రస్తుతం ఇక అలాంటి మాటల జోలికి వెళ్లడంలేదు. ఎందుకంటే నా వల్ల ఎదుటి వాళ్ళకి హైప్ వస్తుందని వదిలేసాను. నేను కూడా తెలంగాణ బిడ్డనే. నాకైతే ఎవరి సింపతీ అక్కర్లేదు. దేవుడు మీద భారం వేసి కెరీర్ లో ముందుకు వెళ్తున్నాను.
అలాగే మా అమ్మ నాన్న నాకిచ్చిన విలువలు చాలా గొప్పవి. అందుకే దిగజారి ప్రవర్తించను. ఇప్పుడు నేను చేసిన ట్వీట్ ని కూడా ఎవరి స్వార్ధం కోసం వాడుకున్నా ఆశ్చర్యం లేదు. కాకపోతే వాళ్లకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పుకొచ్చింది. ఇక చివరిగా ఆంటీ అని పిలిచినందుకు కూడా అతనికి చిన్న ఝలక్ ఇచ్చింది. మీరు నేను చుట్టాలం కాదు నాకు తెలిసి రిలేషన్ ఉంటేనే ఆంటీ అనే పిలుపులు ఉంటాయి. ఒక వేళ మీకు తెలియకుండా రిలేషన్స్ ఉన్నాయేమో అడగండి అని చెప్పింది. ఇప్పుడు ఈ మాటలు వైరల్ గా నిలిచాయి. అనసూయ ప్రస్తుతం పుష్ప 2 (pushpa 2)లో ఒక పవర్ ఫుల్ పాత్రలో మెరవబోతుంది.పార్ట్ 1 ని మించి ఆమె క్యారక్టర్ ఉండబోతుంది. ఇటీవల వచ్చిన రజాకార్ (razakar) కూడా తనకి మంచి పేరుని తెచ్చిపెట్టింది.