మూడున్నర దశాబ్దాల నుంచి హీరోగా రాణిస్తు తన కంటూ ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకున్న హీరో అక్షయ్ కుమార్(akshay kumar)ఎన్నో భారీ హిట్లు ఆయన ఖాతాలో ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు వరుసగా పరాజయాలు పలరిస్తున్నాయి. ఇప్పుడు ఈ పరాజయాల విషయంలోనే అక్షయ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు. పైగా అలా చేసాడో లేదో వైరల్ గా నిలిచాయి.
అక్షయ్ కుమార్ అప్ కమింగ్ మూవీ ఖేల్ ఖేల్ మే(khel khel mein)అగస్ట్ 15 న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ఒక రేంజ్ లో జరుగుతున్నాయి. అందులో భాగంగా అక్షయ్ మాట్లాడుతు కొంత కాలం నుంచి నా సినిమాలు వరుసగా పరాజయం చెందుతున్నాయి. దాంతో కొంత మంది మీరేమి చింతించకండి అంతా సర్దుకుంటుంది. మళ్ళీ మీరు కమ్ బ్యాక్ ఇస్తారు అంటు సానుభూతితో మెసేజస్ చేస్తున్నారు. వాళ్లందరికీ నేను చెప్పేది ఒక్కటే. నా మీద సానుభూతి చూపించకండి నేనేమి చనిపోలేదు. అదే విధంగా కమ్ బ్యాక్ ఇవ్వడానికి నేను ఎక్కడి వెళ్ళలేదు కదా! ఇక్కడే ఉన్నాను ఇప్పుడున్న విధానంగానే నా పనిని కొనసాగిస్తు ఉంటానని చెప్పాడు.
అదే విధంగా ఇప్పటికి వరకు నేనేదైతే సంపాదించానో అదంతా నా స్వార్జితం. సో చివరి వరకు కూడా ఇండస్ట్రీ లోనే ఉంటానని కూడా తెలిపాడు. ఇక ఖేల్ ఖేల్ మే లో తాప్సి, ప్రజ్ఞ జైస్వాల్, వాణి కపూర్, ఫరీద్ ఖాన్, అమ్మి విర్క్ , ఆదిత్య సీల్ లు ముఖ్య పాత్రలు పోషించారు. టి సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్,కిషన్ కుమార్ నిర్మించగా ముదాసర్ అజీజ్(Mudassar Aziz) దర్శకుడు.