Entertainment

నేను చేసిన సినిమా నాకే నచ్చలేదు.. సందీప్‌ కిషన్‌ షాకింగ్‌ కామెంట్స్‌!


సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ స్టార్‌ హీరోల సినిమాలే కాదు, చిన్న హీరోలు చేసిన సినిమాలు కూడా విజయం సాధించాల్సిన అవసరం ఉంది. చిన్న హీరోలు కూడా తాము చేసే సబ్జెక్ట్స్‌ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. సినిమా హిట్‌ అవ్వడానికి ఉండాల్సిన అంశాలేమిటి అని ఆలోచిస్తున్నారు. ఈమధ్యకాలంలో చిన్న హీరోలు కూడా డిఫరెంట్‌ కంటెంట్‌తో ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధపడుతున్నారు. అయితే కొందరు సక్సెస్‌ అవుతున్నారు, కొందరు కాలేకపోతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌తో సినిమాలు చేస్తూ సక్సెస్‌ని వెతుక్కుంటూ వెళ్ళే హీరోల్లో సందీప్‌ కిషన్‌ ఒకరు. గత ఏడాది సందీప్‌ కిషన్‌ హీరోగా రూపొందిన ‘మైఖేల్‌’ గురించి సందీప్‌ కిషన్‌ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌ అయ్యాయి. ఆ సినిమాపై అతను చేసిన కామెంట్స్‌కి అందరూ షాక్‌ అవుతున్నారు. 

సాధారణంగా ఏ హీరో అయినా తను చేసిన ఎంత ఫ్లాప్‌ అయినా, సినిమా ఎంతో కష్టపడి చేశానని, కంటెంట్‌ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నానని చెబుతారు. సినిమా రిలీజ్‌ అయిన తర్వాత హిట్‌ అవ్వకపోతే, తనను నిరాశపరిచిందనో, జనానికి రీచ్‌ అవ్వలేదనో పాజిటివ్‌గా చెబుతారు. ‘మైఖేల్‌’ చిత్రం కోసం సందీప్‌ కిషన్‌ ఎంతో కష్టపడ్డాడు. కానీ, ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈ చిత్రంపై  సందీప్‌ చేసిన కామెంట్స్‌ అందర్నీ షాక్‌కి గురి చేస్తున్నాయి. ‘మైఖేల్‌’ సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు. థియేటర్స్‌లో కూడా ఈ సినిమా బాగా రన్‌ అవ్వలేదు. ఈ సినిమాకి రెవిన్యూ ఎంత వచ్చిందనే విషయాన్ని పక్కన పెడితే ఫైనల్‌ ఔట్‌పుట్‌ నాకే నచ్చలేదు. ఈ విషయాన్ని డైరెక్టర్‌తో చెప్పాను. సినిమాకి సంబంధించిన ఫుటేజ్‌ చాలా ఉంది. ఎడిటింగ్‌లో ఏదైనా మ్యాజిక్‌ చేసి ఉంటే అద్భుతంగా ఉండేది. కానీ, అలా జరగలేదు. అందుకే ఆ సినిమా ఫ్లాప్‌ అయ్యింది’ అన్నారు. 

తాజాగా సందీప్‌ కిషన్‌ నటించిన ‘ఊరు పేరు భైరవకోన’ ఫిబ్రవరి 16న విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి విఐ ఆనంద్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌ హెవీగా జరుగుతున్నాయి. వరుస ఇంటర్వ్యూలతో సందీప్‌ కిషన్‌ బిజీగా ఉన్నారు. ఈ సినిమాకి మంచి బజ్‌ ఉంది. ఈసారి సందీప్‌ పెద్ద హిట్‌ కొడతాడనిపిస్తోంది. 



Source link

Related posts

నాకు మా నాన్నకి  అవసరం లేదు..వ్యక్తిగత భావాన్ని గౌరవిస్తారు

Oknews

అసలేముందిరా ఈ సినిమాలో.. ఇంతలా లేపారు!

Oknews

ఎవరికీ అందనంత ఎత్తులో ప్రభాస్.. 200 కోట్లు ఏంటి సామీ!

Oknews

Leave a Comment