ప్రతి ఒక్కరు కింద స్థాయి నుంచి పైకి వెళ్లి అది కొనాలి.. ఇలా ఉండాలి.. అలా బతకాలి అనేది కామన్ కాకపోతే కష్టపడి పేరు పేరు.. ప్రతిష్ట.. సంపద సంపాదించుకున్న కొందరు సెలబ్రిటీస్ మాత్రం అప్పుడప్పుడు ట్రోలింగ్‌కు గురవుతూ ఉంటారు. గత సంవత్సరం రూ. 150 కోట్ల విలువైన విలాసవంతమైన బంగ్లాను హీరో ధనుష్ కొనుగోలు చేయడంపై అప్పట్లో ఆయన్ను పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారు.
తాజాగా రాయన్ ఆడియో పంక్షన్‌లో ట్రోలింగ్‌పై ధనుష్ మాట్లాడుతూ.. గతంలో ఇల్లు లేని వ్యక్తి.. పొయెస్ గార్డెన్‌లో ఇల్లు కొనుగోలు ఉండకూడదా?.. నాకు ఇల్లు ఉండకూడదా? వీధుల్లో జన్మించిన వ్యక్తి ఎప్పటికీ అక్కడే ఉండాలా? అంటూ ప్రశ్నించారు. 16 ఏళ్ల వయస్సులో తలైవర్ (రజనీకాంత్) ఇంటిని చూడాడానికి వచ్చినప్పుడు జయలలిత గారి ఇల్లు చూసి ఎప్పటికైనా పొయెస్ గార్డెన్‌లో కనీసం ఒక ఇల్లు అయిన కట్టుకోవాలని కోరిక పుట్టిందని అందుకే కష్టపడి సంపాధించి ఇల్లు తీసుకున్నట్లు చెప్పారు.
ఐశ్వర్య రజనీకాంత్, ధనుష్ విడాకుల అనంతరం రజనీకాంత్ అభిమానుల నుండి ధనుష్‌పై పెద్దఎత్తున్న విమర్శలు వస్తునే ఉన్నాయి. బంగ్లా కొనుగొలు ట్రోలింగ్ వెనుక కూడా రజనీకాంత్ అభిమానులు ఉన్నరనేది ధనుష్ అభిమానుల నుండి వస్తున్నా విమర్శలు. ఈ మధ్య కాలంలో చాలా మంది కష్టపడి పై స్థాయికి వచ్చినప్పుడు వారికి కావాల్సినట్లు కార్లు, బంగ్లాల కొనుగొలు, విదేశీ టూర్లు చేస్తున్న కూడా ట్రోలింగ్ చేస్తున్నారు.
కాగా ధనుష్ హీరో గా, డైరెక్టర్‌గా చేసిన రాయన్ సినిమా ఇవాళ రిలీజ్ అయింది. ఈ సినిమా తమిళతో పాటు ఇతర భాషల్లో కూడా ఏక కాలంలో విడుదల చేశారు.