Entertainment

నేను సింగిల్‌‌గానే వుండను… నా వయసు 30 సంవత్సరాలే!


సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి, విడాకులు అనే మాటలు సర్వసాధారణంగా మనకు వినిపిస్తూ ఉంటాయి. అయితే అబ్బాయి, అమ్మాయి సినిమా వాళ్ళే అయి ఉండి, లవ్‌ మ్యారేజ్‌ అయితే వారు కలిసి ఉండే ఛాన్సెస్‌ తక్కువగా ఉంటాయన్నది ప్రూవ్‌ అవుతూనే ఉంది. అదే పెద్దలు కుదిర్చిన సంబంధం అయితే వారి కాపురం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతుందనే విషయం కూడా ప్రూవ్‌ అయింది. కానీ, మెగా డాటర్‌ నిహారిక విషయంలో అలా జరగలేదు. నిహారిక కొణిదెల వివాహం చైతన్య జొన్నలగడ్డతో జరిగింది. వారిది ప్రేమ వివాహం కాదు. పెద్దలు కుదిర్చిన సంబంధం. కానీ, ఇద్దరూ విడాకుల వరకూ వెళ్లారు, విడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు నిహారిక ఒంటరిగానే ఉంటోంది. ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ విడాకుల విషయాన్ని తొలిసారి ప్రస్తావించింది. 

‘పెళ్లికి ముందే ఒకరి గురించి మరొకరు తెలుసుకోవాలి. అప్పుడే పెళ్లి చేసుకోవాలి. మన జీవితంలోకి వచ్చే వ్యక్తి మనకు కొత్త. మన ఇంట్లో ఉండే అమ్మలాగానో, నాన్నలాగానో ఉండరు. అంత ప్రేమగా కూడా చూసుకోలేరు. అందుకే ఒంటరిగా ఎలా ఉండాలో నేర్చుకుంటున్నాను. పెద్దలు కుదిర్చిన సంబంధమే చేసుకున్నాను. విడాకుల ప్రస్తావన వచ్చినపుడు, విడాకులు తీసుకున్నప్పుడు నన్ను చాలా మాటలు అన్నారు. ఎంతో బాధపడ్డాను, ఎంతో ఏడ్చాను. ఆ బాధను భరించడం అంత ఈజీ కాదు. ఎవరైనా జీవితాంతం కలిసి ఉండాలనే పెళ్లి చేసుకుంటారు. ఏడాదిలోనే విడిపోతామని తెలిస్తే అంత ఖర్చుపెటి ఘనంగా ్ట పెళ్లి చేసుకోరు. అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదా. ఇదీ అంతే. 

కానీ, ఈ విషయంలో నా క్యారెక్టర్‌ను తప్పుపట్టారు. కుటుంబాన్ని దూషించారు. అప్పుడు తట్టుకోలేకపోయాను. నా కుటుంబానికి నేను బరువు అని నేననుకోను. అలాగే నా కుటుంబానికి కూడా నేను బరువు అనే భావన లేదు. విడాకులు తీసుకున్న తర్వాత ఈ రెండేళ్లు కుటుంబం విలువ ఏమిటో నాకు తెలిసొచ్చింది.  అయితే నేను ఎప్పటికీ సింగిల్‌గానే ఉండిపోను. నా వయసు 30 సంవత్సరాలే. మంచి వ్యక్తి తారసపడితే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను’ అని వివరించింది.



Source link

Related posts

30 ఏళ్ళ తర్వాత రెండు ఇంటర్వెల్ లతో సినిమా

Oknews

తెరపైకి మరో వివాదం.. నయనతారతో డైరెక్టర్ మారుతి!

Oknews

ఎమోషనల్‌ అయిన విజయ్‌ దేవరకొండ.. తన లవ్‌ సక్సెస్‌ అయిందట!

Oknews

Leave a Comment