పవర్ షేరింగ్ చిచ్చు
అయితే అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ…తనను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మన సామాజిక వర్గం వాళ్లే నన్ను సీఎం కాకుండా అడ్డుకున్నారనే అభిప్రాయంతో ఆయన మాట్లాడరని విశ్లేషకులు అంటున్నారు. దీంతో పాటు జనసేన, టీడీపీ మధ్య పొత్తు కుదిరినా…క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వీటిని తమకు అనుకూలంగా మార్చుకుని పొత్తు విచ్ఛిన్నం చేసేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తుందన్న విమర్శలు లేకపోలేదు. చంద్రబాబు(Chandrababu) ఇద్దరు అభ్యర్థులను ప్రకటించడం, లోకేశ్ చంద్రబాబే సీఎం వ్యా్ఖ్యలపై పవన్ కల్యాణ్(Pawan Kalyan) బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ పొత్తు ధర్మం పాటించడంలేదని విమర్శించారు. రాజానగరం, రాజోలులో జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారు. ఎప్పటి నుంచో సీఎం పదవి కోసం ఎదురుచూస్తున్న కాపు సామాజిక వర్గం నేతలు పవన్ కల్యాణ్ ను సీఎం అభ్యర్థిగా చూస్తు్న్నారు. టీడీపీ, జనసేన కూటమి అధికారంలో వస్తే పవర్ షేరింగ్ కోసం పట్టుబట్టాలని జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలో బొత్స వ్యాఖ్యలు…జనసేన, టీడీపీకి మధ్య ఆజ్యం పోసినట్లు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.