Health Care

నోటి బ్యాక్టీరియాతో పెద్ద పేగు క్యాన్సర్.. సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడి!


దిశ, ఫీచర్స్ : పెద్ద పేగు క్యాన్సర్‌కు అసలు కారణం నోటిలోని బ్యాక్టీరియానే అని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇప్పటికే నోటి శుభ్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే ఇది అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతుందని వైద్యులు హెచ్చరించారు. కాగా నోటిని శుభ్రంగా ఉంచుకోకపోతే, నోట్లో బ్యాక్టీరియా ఫామ్ అయ్యి, పెద్ద పేగు క్యాన్సర్ తయారవుతుందంట. అమెరికాలోని ఫ్రెడ్ హచ్ క్యాన్సర్ సెంటర్ పరిశోధకులు చేసి అధ్యయనంలో నోటి శుభ్రత పాటించని వారిలో పెద్ద పేగు క్యాన్సర్ ఉన్నట్లు, వారి కణితుల్లో నోటి బ్యాక్టీరియా ఉన్నట్లు వారు గుర్తించినట్లు తెలిపారు. అంతే కాకుండా సూక్ష్మజీవి నోటి నుంచి గట్​లోకి ఎలా వెళ్తోంది, ఇది క్యాన్సర్ పెరుగుదలకు ఎలా కారణమవుతుందనే విషయాలను వారు కనుగొన్నారు. ఇక నోటి బ్యాకీరియా లేని వారితో పోలిస్తే ఉన్న వారిలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉన్నట్లు, ఇది వారి గట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వారు పేర్కొన్నారు. అందువలన క్యాన్సర్‌కు చెక్ పెట్టాలంటే నోటిని శుభ్రంగా ఉంచుకోవాలని చెబుతున్నారు వైద్యులు.

ఇక ఇండియాలో ఈ క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉన్నట్లు వారు తెలిపారు. ఈ పెద్ద పేగు క్యాన్సర్​ ఇండియాలోని ఉన్న మొదటి పది క్యాన్సర్‌లలో ఇదొక్కటి అంట. ఇక దీని గురించి అంతగా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, దీనికి అనేక చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి, స్క్రీనింగ్ పద్ధతులు ద్వారా సమస్యను తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు అంటున్నారు వైద్యులు.



Source link

Related posts

స్లీప్ పెరాలసిస్.. నిద్రలో అలా జరిగితే ఈ వ్యాధి బారిన పడ్డట్లే!

Oknews

ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి.. కారు లోయలో పడి యువతి మృతి (వీడియో)

Oknews

వర్షాకాలంలో ఇంట్లోకి పురుగులు రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే!

Oknews

Leave a Comment