దిశ, ఫీచర్స్ : పరిశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడి అయ్యాయి. ప్రస్తుతం చాలా మంది పురుషులు ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడుతున్నారంట. 2040 కల్లా ఈ కేసులు రెట్టింపు అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని ఓ అధ్యయనం చెబుతోంది. ఇది ముఖ్యంగా పురుషులకు మాత్రమే వస్తుంది.ప్రాణాంతక వ్యాధుల్లో ఇదొకటి.అయితే ఈ క్యాన్సర్ అనేది ఎక్కువగా 50 సంవత్సరాలు దాటిన వారిలో వస్తుదంట.ముఖ్యంగా కుటుంబ చరిత్రలో ఎవరికైనా ఉంటే ఇది ఎక్కువగా వస్తుందంట.
ఈ క్యాన్సర్ లక్షణాలు
ప్రొస్టేట్ క్యాన్సర్ ఉంటే తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సిందే.
మూత్రం లేదా వీర్యంలో రక్తం కనిపించడం
మూత్రంలో మంట
ఈ క్యాన్సర్ రావడానికి ముఖ్యమైన కారణాలు :
రెడ్ మీట్ తినడం, కూరగాయలు, పండ్లు తక్కువ తినేవారికి ఈ క్యాన్సర్ వస్తుందంటున్నారు నిపుణులు. అంతే కాకుండా
ఊబకాయం సమస్యతో బాధపడే వారికి కూడా ఈ క్యాన్సర్ రావచ్చు. అయితే పురుషుల్లో వచ్చే మొత్తం క్యాన్సర్ కేసులల్లో 15 ప్రొస్టేట్ క్యాన్సరే ఉంటుందంట. ప్రస్తుతం 14 లక్ష మంది పురుషులు ఈ క్యాన్సర్ బారిన పడి ఇబ్బందులు ఎదుర్కోగా,2040 కల్లా ఈ సంఖ్య 29 లక్షలకు చేరే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు.