Health Care

పండగ రోజుల్లో మాంసాహారాన్ని ఎందుకు నిషేధించారు?.. దాని వెనుక ఉన్న రహస్యం ఇదే


దిశ, ఫీచర్స్: మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పటి తరం తమ సంస్కృతిలో ఎన్నో మార్పులు తెచ్చింది. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వచ్చాయని చెప్పవచ్చు. అయితే కాలం ఎంత మారినప్పటికీ చాలా హిందూ కుటుంబాలు కొన్ని ఆచారాలను కొనసాగిస్తూనే ఉన్నాయి. పండగ రోజుల్లో మాంసం తినకపోవడం ఇప్పటికీ చాలా మంది హిందువులకు ఒక ముఖ్యమైన ఆచారం. కొంతమంది దీనిని మూఢనమ్మకంగా భావిస్తారు, కానీ దీనికి సాంకేతికంగా కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

మన పూర్వీకుల నుంచి వస్తున్న ఎన్నో ఆచారాలలో మాంసాహారం ముట్టకపోవడం కూడా ఒకటి. ఇలా కొన్ని రోజులు మాంసాహారానికి దూరంగా ఉండటం వెనక అసలు కారణం ఉంది. వారం మొత్తం నాన్ వెజ్ తినడం వల్ల శరీరానికి కలిగే నష్టాలు ఇవే.. మనం వారం రోజులు మాంసాహారం తింటే ఈ భూమ్మీద మిగిలిన జీవరాశులు మనుగడ సాగించవు. కాబట్టి కొన్ని పండగ రోజులలో జంతు హింస పాపము అని చెబుతారు. రోజు నాన్ వెజ్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. పెద్ద పేగు క్యాన్సర్,అధిక రక్తపోటు, గుండెపోటు , అల్సర్ వంటి అనేక సమస్యలతో బాధపడే అవకాశం ఉంది.

మామూలుగా చెబితే వినరు కాబట్టి పెద్దలు మతం, సైన్స్ అని చెప్తారు. వాటిని పాటించడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ కొంతమంది ఏమి పట్టించుకోకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తారు. ఏది మంచో.. ఏది చెడో.. ఆలోచించి ఆచరించవచ్చు.



Source link

Related posts

యూట్యూబ్‌లో అత్యధిక సబ్‌స్ర్కైబర్లతో చరిత్ర సృష్టించింది ఇతనికే

Oknews

పెళ్లైన మహిళకు త్వరగా వచ్చేస్తున్న హైబీపీ.. సర్వేలో షాకింగ్ విషయాలు వెళ్లడి!

Oknews

పాదాల్లో మంట, దురద, తిమ్మిర్లు నిర్లక్ష్యం చేస్తున్నారా? ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నవారౌతారు!

Oknews

Leave a Comment